Business Idea: తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు.. పోస్టాఫీస్‌ ఫ్రాంచైజ్‌తో..

పోస్టాఫీస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దేశంలో దాదాపు అన్ని చోట్ల పోస్టాఫీస్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. మొదట్లో కేవలం ఉత్తరాల బట్వాడా మాత్రమే చేసిన పోస్టాఫీస్‌, ప్రస్తుతం బ్యాంకులకు సమాంతరంగా సేవలు అందిస్తున్నాయి. కేవలం బ్యాంకింగ్ సేవలకే కాకుండా...

Business Idea: తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు.. పోస్టాఫీస్‌ ఫ్రాంచైజ్‌తో..
Post Office
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 11, 2024 | 6:14 PM

ప్రస్తుతం బిజినెస్‌ చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వ్యాపారం చేయాలంటే భారీ పెట్టుబడి, నష్టం ఉంటుందేమోన్న భయంతో వెనుకడుగు వేస్తుంటారు. కానీ తక్కువ పెట్టుబడితో రిస్క్‌ లేని వ్యాపారాలు సైతం అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసా.? అలాంటి వాటిలో ఒక బెస్ట్ బిజినెస్‌ ప్లాన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దేశంలో దాదాపు అన్ని చోట్ల పోస్టాఫీస్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. మొదట్లో కేవలం ఉత్తరాల బట్వాడా మాత్రమే చేసిన పోస్టాఫీస్‌, ప్రస్తుతం బ్యాంకులకు సమాంతరంగా సేవలు అందిస్తున్నాయి. కేవలం బ్యాంకింగ్ సేవలకే కాకుండా పలు ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చిన పోస్టాఫీస్‌ కోట్లాది మంది కస్టమర్లను ఆకర్షిస్తోంది. మరి ఇదే పోస్టాఫీస్‌ మీకు మంచి వ్యాపార అవకాశాన్ని అందిస్తోంది. పోస్టాఫీస్‌ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఇందకీ పోస్టాఫీస్‌ ఫ్రాంచైజీని ఎలా మొదలు పెట్టాలి.? ఎంత ఖర్చవుతుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీసు ఫ్రాంచైజీలలో కమీషన్ల ద్వారా సంపాదన. మీ ప్రాంతంలో మీరు అందించే పోస్టాఫీసు సేవలు ఏవైనా. దానిపై పోస్టాఫీసు కమీషన్ చెల్లిస్తుంది. దీని రేట్లు పోస్టాఫీసుతో చేసుకున్న ఎంఓయూలో నిర్ణయిస్తారు. పోస్టాఫీసు ఫ్రాంచైజీలో రెండు రకాలు ఉన్నాయి. మొదటి అవుట్‌లెట్ ఫ్రాంచైజ్ రెండోది ఫ్రాంచైజ్ పోస్టల్ ఏజెంట్లు. మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా ఫ్రాంచైజ్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు.

ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకునే వారు 18 ఏళ్లు నిండి ఉండాలి. తపాలా శాఖలో అంతకుముందు పనిచేస్తున్న వ్యక్తి కుంటుంబ సభ్యులకు ఈ అవకాశం ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రాంచైజీని ఓపెన్‌ చేసిన తర్వాత, మీరు తపాలా స్టాంప్, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్ మొదలైన అనేక రకాల సేవలను అందించడం ద్వారా సంపాదించవచ్చు. పోస్టల్ పోస్ట్‌ను బుకింగ్ చేస్తే రూ. 3, స్పీడ్ పోస్ట్‌పై రూ. 5, తపాలా స్టాంపులు, స్టేషనరీ విక్రయంపై 5 శాతం కమీషన్ లభిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ కోసం, మీరు పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి లేదా నేరుగా ఈ లింక్‌పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి. వెబ్‌సైట్ నుంచి ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసకొని ఫ్రాంచైజీకి అప్లే చేసుకోవాలి. దీని తరువాత, పోస్ట్ డిపార్ట్‌మెంట్ AMU చేస్తుంది. దీంతో మీరు పోస్టాఫీస్‌ ఫ్రాంజైజీని ఓపెన్‌ చేసుకోవచ్చు. కమీషన్‌ విషయానికొస్తే.. రిజిస్టర్డ్ ఆర్టికల్స్ బుకింగ్ పై 3 రూపాయలు, స్పీడ్ పోస్ట్ పై 5 రూపాయలు, మనీ ఆర్డర్‌ పై రూ. 3.50, తపాలా స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ వంటి వాటిపై 5శాతం లాభం పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?