PPF: రిస్క్ లేకుండా మంచి ఆదాయం కావాలా.? ఈ ఫథకంతో చాలా సింపుల్‌గా..
ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం ద్వారా మంది ఆదాయం పొందాలనుకునే వారికి పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌గా చెప్పొచ్చు. ఈ పథకంద ద్వారా మంచి వడ్డీ, ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్ పథకంలో 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో మెచ్యూరిటీ పూర్తయ్యాక...

సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. ఇందుకోసం బ్యాంకులు, పోస్టాఫీస్‌లు పలు రకాల పథకాలను తీసుకొచ్చాయి. ఇలాంటి బెస్ట్ పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం ఒకటి. ఈ పథకాన్ని అన్ని ప్రముఖ బ్యాంకులతో పాటు, పోస్టాఫీస్‌లు అందిస్తున్నాయి. ఇందులో ఆకర్షణీయమైన వడ్డీతో పాటు ట్యాక్స్ నినహాయింపు పొందొవచ్చు. పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లుంటుంది.
ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం ద్వారా మంది ఆదాయం పొందాలనుకునే వారికి పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌గా చెప్పొచ్చు. ఈ పథకంద ద్వారా మంచి వడ్డీ, ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్ పథకంలో 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో మెచ్యూరిటీ పూర్తయ్యాక మూడు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. మొదటి ఆప్షన్ ప్రకారం.. మెచ్యూరిటీ పూర్తయిన వెంటనే విత్ డ్రా చేసుకోవడం, రెండవది విత్ డ్రా చేయకుంటే వడ్డీ అందుతుంది. మూడవది ఐదేళ్లకు పొడగించడం.
ఈ పథకంలో మెచ్యూరిటీ పూర్తయిన వెంటనే మొత్తం సొమ్మును విత్‌డ్రా చేసుకోవాలి. అలా కాకుండా.. అకౌంట్‌ను క్లోజ్ చేయాలనుకుంటే మొత్తం డబ్బు మీ ఎక్కౌంట్‌కు బదిలీ అయిపోతుంది. పీపీఎఫ్ నగదు, వడ్డీ రెండింటిపై ట్యాక్స్ మినహాయింపు ఉండదు. ఇది కాకుండా ఏడాదికి 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. అంతేకాకుండా ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మెచ్యూరిటీ తర్వాత ఐదేళ్లు పొడగించాల్సి ఉంటుంది. ఐదేళ్ల కోసారి పొడిగించుకోవచ్చు. మరో ఐదేళ్లు పొడిగించాలంటే సంబంధిత బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు ఒక ఏడాది ముందు సమాచారం అందించాల్సి ఉంటుంది. ప్రీ మెచ్యూర్ విత్ డ్రాయల్ నిబంధనలు ఏవీ వర్తించవు. ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు.
ప్రస్తుతం పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ వార్షిక ఆధారంగా లెక్కిస్తారు. వడ్డీ నిర్ణయించేది మాత్రం ప్రతి మూడు నెలలకోసారి. గత కొద్దికాలంగా పీపీఎప్ వడ్డీరేటులో తేడా ఏమీ లేదు. నెలకు ఐదు వేల చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లు మెచ్యూరిటీ పూర్తయ్యాక చేతికి 26 లక్షల రూపాయలు అందుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..
