Bank Holidays: బ్యాంకులకు సెలవులు రద్దు.. ఆ రెండు రోజులూ పనిదినాలే..

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వం ఆర్థిక లావాదేవీల సమగ్ర నివేదిక, ప్రభుత్వ చెల్లింపులు, రసీదులను ఆ తేదీలోపే పూర్తి చేయాల్సి ఉంటుంది.నీ క్రమంలో అన్ని ప్రభుత్వ బ్యాంకులు మార్చి 31న పనిచేయాల్సి ఉంటుందని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు మరో రోజు అంటే ఆదివారానికి ముందు మార్చి 30 నాలుగో శనివారం రోజున కూడా సెలవును రద్దు చేస్తూ కొత్త ఉత్తర్వులు ఇచ్చింది.

Bank Holidays: బ్యాంకులకు సెలవులు రద్దు.. ఆ రెండు రోజులూ పనిదినాలే..
Bank Holidays
Follow us
Madhu

|

Updated on: Mar 28, 2024 | 7:53 AM

సాధారణంగా బ్యాంకులకు ఆదివారాలతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం సెలవు దినాలు. అయితే ఈ నెలలో వారికి ఆ రెండు రోజులూ సెలవులను నిలిపివేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో ఉన్నాం. మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వం ఆర్థిక లావాదేవీల సమగ్ర నివేదిక, ప్రభుత్వ చెల్లింపులు, రసీదులను ఆ తేదీలోపే పూర్తి చేయాల్సి ఉంటుంది.నీ క్రమంలో అన్ని ప్రభుత్వ బ్యాంకులు మార్చి 31న పనిచేయాల్సి ఉంటుందని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు మరో రోజు అంటే ఆదివారానికి ముందు మార్చి 30 నాలుగో శనివారం రోజున కూడా సెలవును రద్దు చేస్తూ కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ వీకెండ్లో బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

శని, ఆదివారాలు పనిదినాలే..

పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడంతో పాటు ప్రభుత్వ లావాదేవీలను క్రమబద్దీకరించడానికి ఆర్బీఐ కార్యాలయాలు, ప్రభుత్వ బ్యాంకింగ్‌ను నిర్వహించే ఏజెన్సీ బ్యాంకులలో ఎంపిక చేసిన బ్రాంచ్‌ ఆఫీసులు మార్చి 30, 31 తేదీలలో సాధారణ వేళల్లో తెరిచి ఉంటాయి. ఈ మేరకు ఆర్‌బీఐ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు రోజుల్లో నిర్ణీత సమయం వరకు ఎలక్ట్రానిక్ లావాదేవీలు నిర్వహించవచ్చు.

ఈ లావాదేవీలకు అనుమతి..

నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌: మార్చి 31, 2024 నాటికి, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్‌ఈఎఫ్ట్‌), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్‌) సిస్టమ్‌లను ఉపయోగించి చేసిన లావాదేవీలు అర్ధరాత్రి 24:00 వరకు కొనసాగుతాయి.

ఇవి కూడా చదవండి

చెక్ క్లియరింగ్: ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన ఏవైనా చెక్కులను క్లియరింగ్ కోసం సమర్పించవచ్చు. ఈ ప్రత్యేక ప్రభుత్వ చెక్-క్లియరింగ్ సెషన్‌ల కోసం ఇన్‌స్ట్రుమెంట్ ప్రెజెంటేషన్, రిటర్న్ క్లియరింగ్ తేదీలు, సమయాలు త్వరలో ప్రకటిస్తారు.

బ్యాంకులకు కమీషన్‌..

ప్రభుత్వ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలపై ఏజెన్సీ బ్యాంకులు కమీషన్ పొందవచ్చు. ఆ అంశాలు ఏవంటే..

  • కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అందిన, ఖర్చు చేసిన డబ్బు
  • కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్ల చెల్లింపులు
  • ప్రత్యేక డిపాజిట్ పథకం (ఎస్‌డీఎస్‌) 1975
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) పథకం, 1968
  • కిసాన్ వికాస్ పత్ర, 2014, సుకన్య సమృద్ధి ఖాతా
  • సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్‌), 2004
  • రిలీఫ్ బాండ్‌లు లేదా సేవింగ్స్ బాండ్‌లతో కూడిన లావాదేవీలు వంటి ఏజెన్సీ కమీషన్‌కు అర్హత పొందే రిజర్వ్ బ్యాంక్ సూచించిన ఏదైనా ఇతర పని, ఏజెన్సీ బ్యాంకుల ఎంచుకున్న శాఖలు మాత్రమే మార్చి 31, 2024 ఆదివారం నాడు లావాదేవీల కోసం తెరిచి ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..