Gold Price Today: బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల గోల్డ్ ఎలా ఉందంటే..
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు 67 వేల మార్క్ దాటి రికార్డు స్థాయిలో నమోదైంది. వెండి కూడా కిలో రూ.70వేల మార్క్ దాటింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎగబాకుతున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు 67 వేల మార్క్ దాటి రికార్డు స్థాయిలో నమోదైంది. వెండి కూడా కిలో రూ.70వేల మార్క్ దాటింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎగబాకుతున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి భౌగోళిక, రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కాగా.. బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు రూ. మేర పెరగగా.. కిలో వెండి ధర రూ. 100 మేర తగ్గింది. అయితే, ఈ ధరలు ప్రాంతాల వారీగా భారీ వ్యత్యాసం ఉంటాయి. గురువారం ఉదయం వరకు బంగారం, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,510 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.67,090 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు రూ.61,360, 24 క్యారెట్లు రూ.66,940, చెన్నైలో 22క్యారెట్ల రేట్ రూ.62,160, 24క్యారెట్ల ధర రూ.67,810, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.61,360, 24క్యారెట్లు రూ.66,940 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,360, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.66,940 లుగా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.77,100, ముంబైలో రూ.77,100, చెన్నైలో రూ.80,100, బెంగళూరులో రూ.75,900, హైదరాబాద్ లో రూ.80,100, విజయవాడ, విశాఖపట్నంలో రూ.80,100లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..