Credit Card: కొత్త రూల్స్‌ వచ్చాయ్‌.. క్రెడిట్‌ కార్డు యూజర్లకు అలర్ట్‌..

కొన్ని నియమాలు, నిబంధనల్లో మార్పులుంటాయి. ఈ క్రమంలోనే భారతదేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన క్రెడిట్ కార్డ్ జారీదారులు తమ విధానాలకు, ముఖ్యంగా రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్ ప్రయోజనాలకు సంబంధించి గణనీయమైన మార్పులను తీసుకువస్తున్నట్లు ప్రకటించాయి. ఇతర ప్రైవేటు బ్యాంకులు కూడా మార్పులు చేసే అవకాశాలున్నాయి.

Credit Card: కొత్త రూల్స్‌ వచ్చాయ్‌.. క్రెడిట్‌ కార్డు యూజర్లకు అలర్ట్‌..
Credit Card
Follow us
Madhu

|

Updated on: Mar 28, 2024 | 8:24 AM

కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసిపోతోంది. ఈ క్రమంలో బ్యాంకింగ్‌ రంగంలో కొన్ని మార్పులు చేటుచేసుకుంటాయి. కొన్ని నియమాలు, నిబంధనల్లో మార్పులుంటాయి. ఈ క్రమంలోనే భారతదేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన క్రెడిట్ కార్డ్ జారీదారులు తమ విధానాలకు, ముఖ్యంగా రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్ ప్రయోజనాలకు సంబంధించి గణనీయమైన మార్పులను తీసుకువస్తున్నట్లు ప్రకటించాయి. ఇతర ప్రైవేటు బ్యాంకులు కూడా మార్పులు చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఎస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు ప్రకటించాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎస్‌బీఐ కొత్త రివార్డు రూల్స్‌..

భారతదేశపు అతిపెద్ద బ్యాంక్, ఎస్‌బీఐ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ విధానాన్ని మార్చింది. బ్యాంక్ అందించే క్రెడిట్ కార్డ్‌ల శ్రేణి కోసం చార్జీల చెల్లింపులపై రివార్డ్ పాయింట్‌లు కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి నిలిచిపోనున్నాయి. ఇలా చార్జీల చెల్లింపులపై రివార్డులందించే కార్డుల జాబితాలో ఆరమ్‌, ఎస్‌బీఐ ఎలైట్‌, సింప్లీ క్లిక్‌ ఎస్‌బీఐ వంటి కార్డులున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ లాంజ్ యాక్సెస్ కొత్త రూల్..

కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ నిబంధనలను మార్చింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే త్రైమాసికంలో, రూ. 35,000 థ్రెషోల్డ్ ఖర్చు చేసిన తర్వాత మాత్రమే వినియోగదారుడు ఆ తర్వాతి త్రైమాసికంలో కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌కు అర్హులు అవుతారు. కొత్త నియమాలు కోరల్ క్రెడిట్ కార్డ్, మేక్‌ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్‌తో సహా వివిధ ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లకు వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఎస్‌ బ్యాంక్ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్..

ఎస్ బ్యాంక్ కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి దేశీయ లాంజ్ యాక్సెస్ ప్రయోజనాలను అందించే విధానాన్ని కూడా మార్చింది. రాబోయే త్రైమాసికంలో లాంజ్ యాక్సెస్ పొందడానికి క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లందరూ ప్రస్తుత త్రైమాసికంలో కనీసం రూ. 10,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

యాక్సిస్ బ్యాంక్ రివార్డ్ ఎర్నింగ్, లాంజ్ యాక్సెస్

యాక్సిస్ బ్యాంక్ తన మాగ్నస్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ ఆదాయాలు, లాంజ్ యాక్సెస్‌కి సంబంధించిన నియమాలను మార్చింది. మాగ్నస్ కార్డ్ వార్షిక రుసుములో మినహాయింపు ఇప్పుడు రద్దు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం బీమా, బంగారం, ఇంధన వర్గాలపై ఖర్చు చేయడానికి రివార్డ్ పాయింట్లు ఇకపై అందుబాటులో ఉండవు. ఇది మాత్రమే కాదు, దేశీయ విమానాశ్రయాల లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో కూడా బ్యాంక్ మార్పులు చేస్తుంది. దీని కింద గత మూడు నెలల్లో కస్టమర్లు కనీసం రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 20 నుంచి అమలులోకి వస్తాయి. దేశీయ, అంతర్జాతీయ లాంజ్‌ల కోసం కాంప్లిమెంటరీ గెస్ట్ సందర్శనల సంఖ్య కూడా క్యాలెండర్ సంవత్సరానికి 8 నుంచి 4కి తగ్గించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..