Toxic: కియారా అందాల విధ్వంసం.. టాక్సిక్ రొమాంటిక్ తబాహీ.. ఫ్యాన్స్ డిజప్పాయింట్..!
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇదివరకు విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసిందు. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. యశ్, కియారా ఆద్వాణిల మధ్య సాగే 'తాబాహీ..' ఈ పాటను విశాల్ మిశ్రా ఆలపించగా రామజోగయ్య శాస్త్రి తెలుగు సాహిత్యం రాశారు.

రాకింగ్ స్టార్ యశ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా టాక్సిక్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ‘తబాహీ’ అనే సాంగ్ ఆడియోను మేకర్స్ విడుదల చేశారు. హిందీలో ‘తబాహీ’ అంటే విధ్వంసం అని అర్థం. టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఈ రొమాంటిక్ ట్రాక్ ఆడియో మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పాట కోసం రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తుంటే కియారా అద్వానీ అందాల విధ్వంసమే కనిపిస్తోంది. యశ్ ఆమెను ఎత్తుకుని అలా రొమాంటిక్‌గా నడుస్తున్న స్టిల్ నెటిజన్లకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ తెరపై వేరే లెవెల్లో ఉండబోతుందని ఈ ఒక్క పోస్టర్‌తోనే అర్థమైపోతోంది.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..
అంతా బాగానే ఉన్నా.. పాట విన్నాక ఆడియన్స్ మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఈ పోస్టర్స్‌లో గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కియారా కళ్ళకు ఉన్న స్పెషల్ లుక్. దీన్ని బట్టి చూస్తే సినిమాలో కియారా బ్లైండ్ రోల్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒక భారీ కమర్షియల్ సినిమాలో స్టార్ హీరోయిన్ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సాంగ్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ మాత్రం కాస్త హర్ట్ అయ్యారు. కియారా, యశ్ కాంబోలో అదిరిపోయే విజువల్స్‌తో కనీసం లిరికల్ వీడియో అయినా వస్తుందని యశ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ మేకర్స్ కేవలం ఆడియోను మాత్రమే వదిలి ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేశారు. విజువల్ ట్రీట్ మిస్ అవ్వడంతో సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..
వీడియో గ్లింప్స్ లేదా మేకింగ్ షాట్స్ లాంటివి ఏమైనా జోడించి ఉంటే ఈ పాటకు మరింత బజ్ వచ్చేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పాట ట్యూన్, సింగింగ్ విషయానికి వస్తే.. బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ విశాల్ మిశ్రా తన మార్క్ చూపించాడు. ఈ ‘తబాహీ’ పాటకు స్వయంగా ఆయనే మ్యూజిక్ కంపోజ్ చేయడంతో పాటు తనదైన స్టైల్లో అద్భుతంగా పాడాడు. విశాల్ వాయిస్‌లోని మ్యాజిక్ ఈ రొమాంటిక్ ట్రాక్‌కు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. లిరిక్స్ కూడా క్యాచీగా ఉండటంతో ఆడియో పరంగా ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలవడం గ్యారెంటీ అనిపిస్తోంది. వీడియో లేకపోయినా, కేవలం ఆడియోతోనే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే రేపు థియేటర్లలో విజువల్స్‌తో కలిపి చూస్తే ఇంకెంత ఇంపాక్ట్ ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..
మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘టాక్సిక్’ ప్రమోషన్స్ జోరును మేకర్స్ అమాంతం పెంచేశారు. వరుస అప్డేట్స్తో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. కియారా అద్వానీ గ్లామర్ ప్లస్ బ్లైండ్ క్యారెక్టర్, విశాల్ మిశ్రా మ్యూజిక్, దానికి తోడు యశ్ స్వాగ్.. ఇవన్నీ కలిపి మార్చి 19న బాక్సాఫీస్ దగ్గర నిజమైన ‘తబాహీ’ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఫ్యాన్స్ ఆశిస్తున్నట్లుగా త్వరలోనే ఈ పాట తాలూకు వీడియో గ్లింప్స్ కూడా బయటకు వస్తుందేమో చూడాలి. సినిమా అయితే అనుకున్న టైమ్‌కు వచ్చేస్తుంది. రాబోయే 10 రోజుల్లో సినిమాకు సంబంధించిన మరిన్ని ప్రమోషన్స్ జరగబోతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‌తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..
