AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: చెక్‌ క్లియరెన్స్‌లో కొత్త విధానం.. ఇప్పుడు కొన్ని గంటల్లోనే..

RBI Cheque Clearing Rules: చెక్‌ల భద్రతను పెంచడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ పాజిటివ్ పే సిస్టమ్‌ను తప్పనిసరి చేసింది. ఈ విధానంలో రూ.50,000 కంటే ఎక్కువ విలువైన చెక్‌ల కోసం కస్టమర్లు ముందుగానే కొన్ని వివరాలు బ్యాంకుకు సమర్పించాలి. వాటిలో అకౌంట్..

RBI: చెక్‌ క్లియరెన్స్‌లో కొత్త విధానం.. ఇప్పుడు కొన్ని గంటల్లోనే..
Subhash Goud
|

Updated on: Oct 14, 2025 | 11:29 AM

Share

RBI Cheque Clearing Rules: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్‌ విధానంలో కీలక మార్పులు తీసుకువస్తోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నిబంధనలలో మార్పులు తీసుకువస్తోంది. ముఖ్యంగా ఏదైనా చెక్‌ క్లియరెన్స్‌ కావాలంటే రెండు, మూడు రోజుల సమయం పట్టేది. కొన్ని సందర్భాలలో ఇంకా ఎక్కువ సమయం పట్టేది. కానీ ఇప్పుడు అలాంటి సమస్యకు గుడ్‌బైక్‌ చెప్పే రోజులు రానున్నాయి. ఇప్పుడు కొన్ని గంటల్లోనే క్లియరెన్స్‌ కానుంది. భారతదేశంలో చెక్కు క్లియరింగ్ వ్యవస్థ చాలా వేగంగా మారనుంది. బ్యాచ్-ఆధారిత ప్రక్రియ నుండి నిరంతర క్లియరింగ్, రియలైజేషన్ తర్వాత సెటిల్మెంట్‌కు మారుతుంది. అంటే చెక్కుల నుండి నిధులు సాధారణ ఒకటి నుండి రెండు పని దినాలకు బదులుగా కొన్ని గంటల్లోనే మీ బ్యాంక్ ఖాతాకు చేరుతాయి.

ఇది కూడా చదవండి: Gold Price: దంతేరాస్‌ ముందు మహిళలకు దిమ్మదిరిగే షాక్‌.. బంగారంపై 3,200, వెండిపై 4,000 పెరుగుదల

అక్టోబర్ 4న అధికారికంగా అమలులోకి రాకముందే శుక్రవారం కొత్త చెక్ క్లియరెన్స్ సిస్టమ్ ట్రయల్ రన్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్వహించింది. కొత్త విధానం ప్రకారం, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒకే ప్రెజెంటేషన్ సెషన్‌లో బ్యాంకు శాఖలలో జమ చేసిన అన్ని చెక్కులను స్కాన్ చేసి, ముగింపు రోజు కోసం వేచి ఉండటానికి బదులుగా, తక్షణమే సెంట్రల్ క్లియరింగ్ హౌస్‌కు పంపుతారు. క్లియరింగ్ హౌస్, “చెక్ ఇమేజ్‌లను నిరంతర ప్రాతిపదికన డ్రాయీ బ్యాంకులకు విడుదల చేస్తుంది. డ్రాయీ బ్యాంకుకు చెక్ ఇమేజ్ వచ్చిన తర్వాత చెక్‌ క్లియర్‌ అవుతుందా లేదా అని నిర్ధారించడానికి సాయంత్రం 7 గంటల వరకు సమయం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Auto News: దేశ ప్రజల మనస్సు దోచుకున్న బైక్‌లు.. కేవలం రూ.75వేలలోనే.. మైలేజీ మాత్రం అదుర్స్‌!

చెక్‌ల భద్రతను పెంచడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ పాజిటివ్ పే సిస్టమ్‌ను తప్పనిసరి చేసింది. ఈ విధానంలో రూ.50,000 కంటే ఎక్కువ విలువైన చెక్‌ల కోసం కస్టమర్లు ముందుగానే కొన్ని వివరాలు బ్యాంకుకు సమర్పించాలి. వాటిలో అకౌంట్ నంబర్, చెక్ నంబర్, చెక్ తేదీ, చెక్ మొత్తం లబ్ధిదారుడి పేరు తెలియజేయాలి. ఈ వివరాలను చెక్ డిపాజిట్ చేయడానికి కనీసం 24 పని గంటల ముందు బ్యాంకుకు ఈ-మెయిల్ ద్వారా పంపించాలి.

బ్యాంక్ వాటిని ధృవీకరించిన తర్వాత చెక్ వివరాలు సరిపోలితే క్లియర్ అవుతుంది. ఒకవేళ వివరాలు సరిపోలకపోతే చెక్ తిరస్కరించబడుతుంది. మీరు మళ్లీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రూ.5లక్షల కంటే ఎక్కువ విలువైన చెక్‌లకు పాజిటివ్ పే సిస్టమ్ తప్పనిసరి. అయితే రూ.50,000పైన ఉన్న చెక్‌లకు దీనిని ఉపయోగించమని బ్యాంకులు సిఫార్సు చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: BSNL Annual Plan: ఈ చౌకైన రీఛార్జ్‌తో ఏడాది పాటు వ్యాలిడిటీ.. అక్టోబర్‌ 15 వరకు మాత్రమే.. మిస్‌ కాకండి!

ఆర్బీఐ ఈ కొత్త విధానాన్ని రెండు దశల్లో అమలు చేయనుంది. మొదటి దశ అక్టోబర్ 4, 2025 నుంచి మొదలైంది. రెండో దశ జనవరి 3, 2026 నుంచి అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానం చెక్ క్లియరెన్స్‌ను వేగవంతం చేయడమే కాకుండా మీ లావాదేవీలను మరింత సురక్షితం చేస్తుంది. కస్టమర్లు తమ చెక్ వివరాలను జాగ్రత్తగా నింపడం, పాజిటివ్ పే సిస్టమ్‌ను ఉపయోగించడం ద్వారా పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..