AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Annual Plan: ఈ చౌకైన రీఛార్జ్‌తో ఏడాది పాటు వ్యాలిడిటీ.. అక్టోబర్‌ 15 వరకు మాత్రమే.. మిస్‌ కాకండి!

BSNL Annual Plan: బీఎస్ఎన్ఎల్ ఈ 4జీ నెట్‌వర్క్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. అంతేకాదు.. త్వరలో 5G నెట్‌వర్క్‌ కూడా అందుబాటులోకి రానుంది. దీని కోసం పనులు కూడా ముమ్మరం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్..

BSNL Annual Plan: ఈ చౌకైన రీఛార్జ్‌తో ఏడాది పాటు వ్యాలిడిటీ.. అక్టోబర్‌ 15 వరకు మాత్రమే.. మిస్‌ కాకండి!
Subhash Goud
|

Updated on: Oct 13, 2025 | 8:28 AM

Share

BSNL Annual Plan : ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ తన వినియోగదారుల కోసం రకరకాల రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగదా 4జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ 4జీ నెట్‌వర్క్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. అంతేకాదు.. త్వరలో 5G నెట్‌వర్క్‌ కూడా అందుబాటులోకి రానుంది. దీని కోసం పనులు కూడా ముమ్మరం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే దాదాపు లక్ష కొత్త 4G టవర్లను ఏర్పాటు చేసింది.

బీఎస్ఎన్ఎల్ దీర్ఘకాలిక ప్లాన్‌లలో ఒకదానిపై స్పెషల్ లిమిటెడ్ ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్ 15 వరకు ఈ కొత్త ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంటే ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోగా వార్షిక రీఛార్జ్ ప్లాన్ తీసుకోవడం బెటర్.

ఇవి కూడా చదవండి

రూ.1,999 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ :

బీఎస్ఎన్ఎల్ కేవలం రూ. 1,999కు 330 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్, జియో, Vi వంటి ప్రైవేట్ టెలికాం పోటీదారుల ప్లాన్‌ల కంటే అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చునని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ వివరాలను కంపెనీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.

ప్లాన్ బెనిఫిట్స్, డిస్కౌంట్లు:

ఈ ప్లాన్‌ ద్వారా దేశమంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్‌ కాల్స్ అందుకోవచ్చు. అలాగే రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా, 330 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే చెల్లుబాటులో మొత్తం డేటా 495GB. అంతేకాకుండా ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లను ఉచితంగా పొందవచ్చు. అక్టోబర్ 15 లోపు ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసే యూజర్లకు ఇన్‌స్టంట్ 2 శాతం తగ్గింపు లభిస్తుంది. 2 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందడానికి వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ప్రత్యేకంగా నంబర్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులు సెలవులు!

ఓటీటీ బెనిఫిట్స్ :

ఈ ప్లాన్‌ ద్వారా మొబైల్ యూజర్లందరికి BiTV సర్వీసుకు ఫ్రీ యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. 350కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, వివిధ OTT అప్లికేషన్‌లకు యాక్సెస్‌ అందిస్తుంది. ప్రీమియం ఛానెల్‌లు, అదనపు ఓటీటీ కంటెంట్‌ను యాక్సెస్ కోసం వినియోగదారులు BiTVకి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: రూ.1 లక్ష 25 వేలు దాటిన బంగారం ధర.. చుక్కలు చూపిస్తున్న వెండి

ఇది కూడా చదవండి: Jio Diwali Offer: జియో దీపావళి బంపర్‌ ఆఫర్‌.. రూ.369తో రీఛార్జ్‌ చేసుకుంటే 4 నెలల వ్యాలిడిటీ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి