Gold Price Today: రూ.1 లక్ష 25 వేలు దాటిన బంగారం ధర.. చుక్కలు చూపిస్తున్న వెండి
Gold Price Today: భారత మార్కెట్‌లో బంగారం ధరలపై ప్రభావం - అంతర్జాతీయ బంగారం ధరలు పెరగడంతో భారత మార్కెట్‌లో కూడా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం కూడా ధరలను మరింతగా ఎగబాకేలా చేసింది. అలాగే..

Gold Price Today: ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. సామాన్యుడు బంగారం కొనాలంటేనే భయపడే రోజులు ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. అమెరికా షట్ డౌన్, చైనా ఆర్థిక పరిస్థితులలో బలహీనత, మధ్యప్రాచ్యంలో జియోపాలిటికల్ ఉద్రిక్తతలు వంటి అంశాలు పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తులవైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం పై డిమాండ్ పెరిగి, ధరలు కొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి.
ఇది కూడా చదవండి: School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వరుసగా 3 రోజులు సెలవులు!
భారత మార్కెట్‌లో బంగారం ధరలపై ప్రభావం – అంతర్జాతీయ బంగారం ధరలు పెరగడంతో భారత మార్కెట్‌లో కూడా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం కూడా ధరలను మరింతగా ఎగబాకేలా చేసింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,220 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,790 ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,450 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,990 ఉంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,070ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,640 ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,070ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,640 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,070ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,640 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,070ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,14,640 ఉంది.
- ఇక వెండి ధర కిలోకు రూ.1, 79,900 ఉండగా, హైదరాబాద్, కేరళ, చెన్నైలలో కిలోకు రూ.1.89,900.
ఇది కూడా చదవండి: Jio Diwali Offer: జియో దీపావళి బంపర్ ఆఫర్.. రూ.369తో రీఛార్జ్ చేసుకుంటే 4 నెలల వ్యాలిడిటీ!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




