AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ఇంట్లోనే ఉంటూ.. అతి తక్కువ పెట్టుబడితో నెలకు రూ.50 వేలు సంపాదించే బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా!

ఇంట్లో ఉంటూనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలని అనుకుంటున్నారా? కేవలం రూ.30,000తో ఇంటి వద్దే పిజ్జా బిజినెస్ (క్లౌడ్ కిచెన్) ప్రారంభించండి. ఆన్‌లైన్ ద్వారా పిజ్జాలు విక్రమిస్తూ నెలకు రూ.50,000 వరకు ఆదాయం పొందవచ్చు. FSSAI లైసెన్స్, మంచి పదార్థాలతో ఈ లాభదాయకమైన వ్యాపారాన్ని మొదలుపెట్టండి.

Business Ideas: ఇంట్లోనే ఉంటూ.. అతి తక్కువ పెట్టుబడితో నెలకు రూ.50 వేలు సంపాదించే బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా!
100 Notes
SN Pasha
|

Updated on: Oct 13, 2025 | 7:00 AM

Share

చాలా మందికి ఉన్న ఊర్లో, ఉన్న ఇంట్లోంచే మంచి వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఇప్పుడో అద్భుతమైన బిజినెస్‌ ఐడియా గురించి తెలుసుకుందాం.. ఈ బిజినెస్ చేస్తూ మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్ తినేందుకు యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఈ జంక్ ఫుడ్ ఇంటి వద్ద తయారు చేసినట్లయితే కాస్త ఆరోగ్యకరం అని చెప్పవచ్చు. మీరు ఇంటి వద్దనే జంక్ ఫుడ్ తయారు చేసి అమ్మితే మంచి లాభాలు పొందవచ్చు.

కేవలం రూ.30 వేల పెట్టుబడితో పిజ్జా కార్నర్ బిజినెస్ స్టార్ట్‌ చేస్తే.. మీరు ఇంటి వద్ద ఉంటూనే నెలకు రూ.50 వేల వరకు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ చేస్తూ పిజ్జాలను ఆన్లైన్ ద్వారా విక్రయించి పెద్ద మొత్తంలో ఆదాయం పొందవచ్చు. మీరు ఇంటి వద్ద ఉంటూనే క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసి పిజ్జా తయారీ మేకింగ్ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఇందుకోసం మీరు మినీ పిజ్జా ఓవెన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర రూ.10,000 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఇతర ఖర్చులకు మరో రూ.20 వేలు వేసుకోండి. మొత్తంగా కేవలం రూ.30 వేలతో ఈ బిజినెస్‌ మొదలుపెట్టవచ్చు.

అనంతరం మీరు ఒక గదిని ఏర్పాటు చేసుకొని అందులో పిజ్జా తయారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆర్డర్ల కోసం స్విగ్గి, జొమాటో లో రిజిస్టర్ చేయించుకుంటే సరిపోతుంది. అయితే దీనికోసం మీరు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. FSAAI సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అనంతరం మీరు పిజ్జా బిజినెస్ ఇంటి వద్ద ఉండి ప్రారంభించవచ్చు. పిజ్జా తయారీలో అత్యంత ముఖ్యమైనది చీజ్, సాసెస్ అని చెప్పవచ్చు. వీటి కోసం మంచి క్వాలిటీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిజ్జా తయారీలో వాడే బేస్ ను మీరు ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు.

వీలైతే పిజ్జా తయారీ ఎలా చేయాలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలు, హోమ్ సైన్స్ ఇన్స్టిట్యూట్స్ శిక్షణ ఇస్తుంటాయి. తద్వారా మీకు పిజ్జా తయారీలో మెలకువలు నేర్చుకోవచ్చు. పిజ్జాతో పాటు, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, గార్లిక్ బ్రెడ్ వంటివి కూడా అందుబాటులో ఉంచినట్లయితే చక్కటి ఆర్డర్లను పొందవచ్చు. మీరు ఈ బిజినెస్ చక్కగా చేసుకున్నట్లయితే క్వాలిటీ మెయింటైన్ చేసినట్లయితే, నెలకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ బిజినెస్‌ సిటీ, టౌన్స్‌లో అయితే వర్క్‌అవుట్‌ అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కష్టం. మరి ఇంకెందుకు ఆలస్యం రూ.30 వేలు ఉంటే ఈ బిజినెస్‌ మొదలుపెట్టేయండి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి