Jio Diwali Offer: జియో దీపావళి బంపర్ ఆఫర్.. రూ.369తో రీఛార్జ్ చేసుకుంటే 4 నెలల వ్యాలిడిటీ!
Jio Diwali Offer: రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో అత్యధిక వినియోగదారులను కలిగిన నెట్‌వర్క్. తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో కొత్త కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు దీపావళి సందర్భంగా వారి కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. కేవలం రూ.369తో రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా 4 నెలల పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. షరతులు వర్తిస్తాయి..

Jio Diwali Offer: దీపావళి సందర్భంగా కంపెనీ సరసమైన ధర జియో భారత్ ఫోన్‌లను విడుదల చేసింది. ఈ 4G ఫోన్‌లు రూ.699 నుండి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 2Gని ఉపయోగిస్తున్న ఒక కోటి (10 మిలియన్) మంది వినియోగదారులను 5Gకి మార్చాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. అత్యల్ప నెలవారీ ప్లాన్‌లను ప్రవేశపెట్టడంతో జియో భారత్ V4 మోడల్ బాగా ప్రాచుర్యం పొందింది.
ఇది కూడా చదవండి: School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వరుసగా 3 రోజులు సెలవులు!
38% వరకు ఆదా చేసుకోండి:
జియో భారత్ ఫోన్ వినియోగదారుల కోసం కంపెనీ ఆకర్షణీయమైన ప్లాన్‌లను అందిస్తోంది. రూ.123కి మీరు 14 GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లను 28 రోజుల పాటు పొందుతారు. ఇతర టెలికాం ప్రొవైడర్ల ఇలాంటి ప్లాన్ ధర దాదాపు రూ.199. దీని ద్వారా వినియోగదారుడు 38% వరకు ఆదా చేసుకోవచ్చు.
దీపావళి సందర్భంగా కలిసి రీఛార్జ్ చేసుకునే వారికి ప్రత్యేక ఆఫర్ కూడా ఉంది. అయితే ఈ ఆఫర్ అందరికి కాదని గుర్తించుకోండి. కేవలం జియో ఫోన్ వాడుతున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. మీరు మూడు నెలలు కలిసి రూ.369కి రీఛార్జ్ చేసుకుంటే, మీకు ఒక నెల సర్వీస్ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. అంటే, మీరు రూ.369కి నాలుగు నెలల పాటు సేవలను ఉపయోగించవచ్చు. దీని ధర నెలకు రూ.92 మాత్రమే. ఈ ప్లాన్ వార్షిక ప్రాతిపదికన రూ.1234కి కూడా అందుబాటులో ఉంది. సరసమైన ఇంటర్నెట్‌తో పాటు, జియోభారత్ ఫోన్ వినోదం, రోజువారీ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, జియోసావ్న్ ద్వారా 80 మిలియన్ పాటలు, జియో టీవీ ద్వారా 600 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు JioPayని ఉపయోగించి సులభంగా UPI లావాదేవీలు చేయవచ్చు. కంపెనీ వ్యవస్థాపకులు, వ్యాపారుల కోసం ఉచిత JioPay సౌండ్ బాక్స్‌ను కూడా అందిస్తోంది.
ఇది కూడా చదవండి: Multibagger Stock: లక్ష రూపాయల స్టాక్ ఐదేళ్లలో రూ.1.84 కోట్లుగా మార్చింది..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








