Post Office TD scheme: భార్య పేరు మీద రూ. లక్ష డిపాజిట్ చేస్తే రెండేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే..
మీరు ఎలాంటి రిస్క్ లేని సేఫ్ పెట్టుబడుల కోసం చూస్తున్నారా? అయితే మీ కోసం మంచి పోస్టాఫీస్ స్కీములున్నాయి. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్‌ల కంటే సేఫ్ గా మంచి రిటర్న్స్ ఇచ్చే పోస్టాఫీస్ స్కీమ్ గురించి అందులో పెట్టుబడి పెడితే వచ్చే వడ్డీ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మంచి వడ్డే ఇచ్చే పోస్టాఫీస్ పథకాల్లో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం కూడా ఒకటి. ఇది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ లాగానే పనిచేస్తుంది. పెట్టుబడిదారులు ఒకేసారి మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. ఇందులో టెన్యూర్ ని బట్టి వడ్డీ మారుతుంది. మీరు ఒక సంవత్సరం లేదా 2, 3, 5 ఏళ్ల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. వ్యవధి ఎంత ఎక్కువగా ఉంటే, వడ్డీ రేటు అంత ఎక్కువగా ఉంటుంది. ఇది మీ భాగస్వామి లేదా పిల్లల పేరుతో కూడా తెరవొచ్చు.
స్కీమ్ డీటెయిల్స్
ఇందులో కనీస డిపాజిట్ రూ.1,000, గరిష్ట పరిమితి లేదు. ఈ స్కీమ్ లో ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్ల సవరిస్తారు. ప్రస్తుతం రెండేళ్ల పాటు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు సంవత్సరానికి 7.0 శాతం. ఐదేళ్లకు ఇది 7.5 శాతానికి పెరుగుతుంది. ఉదాహరణకు మీరు మీ భార్య పేరు మీద పోస్టాఫీస్ టీడీ పథకంలో రూ. లక్ష పెట్టుబడి పెడితే 2 సంవత్సరాల కాలానికి మీ మొత్తం రాబడి సుమారు రూ.1,14,888 అవుతుంది. అంటే మీకు రూ. 14,888 వడ్డీ ఆదాయం అదనంగా సమకూరుతుంది.
వీళ్లకు బెస్ట్
ఈ స్కీమ్ పూర్తిగా సేఫ్ ఆప్షన్. ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయం పొందే మార్గం. ఇది పిల్లలు, భార్య/భర్త పేరు మీద పెట్టుబడి పెట్టడానికి బాగుంటుంది. మీ పిల్లలు లేదా భార్య ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండేందుకు ఇలాంటి స్కీమ్స్ సాయపడతాయి. ఈ స్కీమ్ షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ రెండిటికీ బాగుంటుంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్ లో మరింత రాబడి లభించినప్పటికీ అందులో ఎంతోకొంత రిస్క్ ఉంటుంది. కాబట్టి పోస్టపీస్ పథకం అన్నిరకలుగా బెస్ట్ అని చెప్పొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




