Gold Rate Today: బంగారం ధర పైపైకి.. రూ. 2 లక్షలకు చేరువలో వెండి ధర..!
Gold Price Today: బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహం చాలా మందిలో వస్తుంటుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి స్థితిగతులు ఇదేవిధంగా కొనసాగినట్లయితే బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని..

Gold Rate Today: బంగారం ధరలు పెరుగులు పెడుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపు ధరతో పరుగులు పెడుతోంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా అక్టోబర్ 12న దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గతంలో ధర పెరిగితే పదుల సంఖ్యల పెరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు వందల రూపాయలలో పెరుగుతోంది. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,25,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,650 ఉంది. అదే విధంగా వెండి ధర మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. కిలో వెండి ధర రూ.1,80,000 ఉంది. ఇక హైదరాబాద్, హైదరాబాద్, కేరళ రాష్ట్రాల్లో మాత్రం భారీగా ఉంది. ఇక్కడ కిలోకు రూ.1,90,000 ఉంది.
ఇది కూడా చదవండి: Ration Card: ఈ రూల్స్ పాటించాల్సిందే.. లేకుంటే రేషన్ కార్డు రద్దు..!
బంగారం ధరలు నిజానికి అంతర్జాతీయ మార్కెట్ల వల్లనే ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముఖ్యంగా అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 4000 డాలర్లు దాటింది. ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయి ఇది. గోల్డ్ రేట్లు భారీగా పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా డాలర్ విలువ పతనం అవడం కూడా బంగారం విలువ పెరగడానికి దోహదపడింది. డాలర్ విలువ గడచిన ఏడాదికాలంగా గమనించినట్లయితే దాదాపు పది శాతం తగ్గింది. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 50 శాతం మేర పెరిగినట్లు చూడవచ్చు.
ఇది కూడా చదవండి: Astrology: ఈ నెలలో పుట్టిన అమ్మాలు అందంలో అప్సరసలే.. కుర్రాళ్ళు పెళ్లంటూ చేసుకుంటే వీరినే చేసుకోవాలి..!
భవిష్యత్తులో పరిస్థితి ఏంటి?
బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహం చాలా మందిలో వస్తుంటుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి స్థితిగతులు ఇదేవిధంగా కొనసాగినట్లయితే బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే మధ్య మధ్యలో కొంత తగ్గుముఖం పట్టినా మళ్లీ ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు.
రూ.2 లక్షల వరకు వెండి వెళ్లనుందా?
మరోవైపు బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతుంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వెండి ధర ఏకంగా 1.80 లక్షల రూపాయల సమీపానికి చేరుకుంది. వెండి ధర భవిష్యత్తులో ఒక కేజీ రెండు లక్షల రూపాయలకు చేరుకునే అవకాశం కనిపిస్తోందంటున్నారు నిపుణులు.
ఇది కూడా చదవండి: BSNL: కేవలం 319 రూపాయలకే 65 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








