Video: ధర ఇంకా పెరుగుతుందని.. బంగారం, వెండి తొందరపడి కొంటున్నారా? అయితే మీరు లక్షలు నష్టపోతారు! ఇది చూడండి..
బంగారం, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. భవిష్యత్తులో మరింత పెరుగుతాయన్న ఆశతో కొనుగోలు చేసేవారిని మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. తక్కువ ధరలకు నకిలీ వెండి బిస్కెట్లు (అల్యూమినియం పూతతో) అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారు. లక్షలు పోగొట్టుకుంటున్నారు కాబట్టి, కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ప్రస్తుతం ఎక్కడ చూసినా బంగారం ధర గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనంతగా బంగారం ధర పైపైకి వెళ్లిపోతుంది. ఇప్పటికే 10 గ్రాముల బంగారం, ఒక కిలో వెండి ధర లక్షపైనే దాటేశాయి. అలాగే ఇప్పుడు ఈ రెండింటి ధర కూడా ఆల్‌టైమ్ రికార్డ్‌కు చేరుకుంది. ఇలా బంగారం, వెండి ధరలు పెరుగుతుంటే.. భవిష్యత్తులో మరింత పెరుగుతుందేమో? ఇప్పుడు కొనలేకపోతే తర్వాత కొనలేమనే భయంతో, లేదా రేటు మరింత పెరిగితే లాభం వస్తుందనే ఆశతోనో కొంతమంది వెనుకా ముందు పెద్దగా ఆలోచించకుండా కొనేస్తున్నారు.
అలా కొన్న వారు చాలా బాధపడే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. బంగారం, వెండిపై ప్రజల్లో ఉన్న డిమాండ్‌ను కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. లోపల అంతా అల్యూమినియంతో నింపేసి.. బయట వెండి పూత పూసిన బిస్కెట్లు అమ్ముతున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు ఇస్తూ ప్రజలను కొంతమంది మోసం చేస్తున్నారు. తక్కువ రేటుకు వస్తుందని కొంతమంది వాటిని కొని లక్షలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి మోసానికి సంబంధించి ఒక వీడియో వైరల్‌గా మారింది. అది చూస్తే వెండి కొనాలనుకునేవారికి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది.
View this post on Instagram
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




