Gold Price Today: హైదరాబాద్‌లో వెండి ధర రూ. 2 లక్షలు.. బంగారం ధర ఎంతో తెలిస్తే బిత్తరపోతారు!
Gold Price Today: దీపావళికి ముందే బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయని వారణాసి సరాఫా అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ అగర్వాల్ అన్నారు. నిరంతరం పెరుగుతున్న ధరలు కస్టమర్లను, వ్యాపారులను దిగ్భ్రాంతికి గురిచేశాయని అన్నారు. బులియన్ మార్కెట్లో వెండి ధర..

Gold Price Today: ధంతేరాస్‌కు ముందు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పండుగకు ముందు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న ఒక్క రోజు భారీగా పెరిగింది. 2 వేల రూపాయలకుపైగా ఎగబాకింది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి.తాజాగా అక్టోబర్ 14వ దేశంలో బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర1,25,410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,960 వద్ద ఉంది. ఇక వెండి విషయానికోస్తే కిలో వెండి ధర రూ.1.85,100 ఉండగా, హైదరాబాద్‌లో అయితే కిలో వెండి రెండు లక్షలకు చేరువలో ఉంది. అంటే రూ.1,97,100 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: Auto News: దేశ ప్రజల మనస్సు దోచుకున్న బైక్‌లు.. కేవలం రూ.75వేలలోనే.. మైలేజీ మాత్రం అదుర్స్!
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,110 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,960 ఉంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,960 ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,960 ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,810 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,960 ఉంది.
దీపావళికి ముందే భారీగా పెరుగుతోంది:
దీపావళికి ముందే బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయని వారణాసి సరాఫా అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ అగర్వాల్ అన్నారు. నిరంతరం పెరుగుతున్న ధరలు కస్టమర్లను, వ్యాపారులను దిగ్భ్రాంతికి గురిచేశాయని అన్నారు. బులియన్ మార్కెట్లో వెండి ధర 2020-21లో కిలోకు రూ.60,000గా ఉంది. ఇప్పుడేమో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. దీపావళి, రాబోయే రోజుల్లో వివాహాలు ప్రారంభమవుతాయి. ఇది ధరలలో పెరుగుదల ధోరణిని కొనసాగించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వరుసగా 3 రోజులు సెలవులు!
బంగారు ఆభరణాల ధరలు నిరంతరం పెరుగుతున్నందున మధ్యతరగతి ప్రజలు వెండి ఆభరణాలపై దృష్టి సారించారు. అయితే, ఇప్పుడు, బంగారం, వెండి రెండింటి ధరలలో వేగవంతమైన పెరుగుదల కారణంగా, సామాన్యులు కృత్రిమ ఆభరణాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






