AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Rules: బ్యాంకుల ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని.. ఎప్పుడు అమల్లోకి వస్తుంది?

Bank Rules: ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఒక రోజు మాత్రమే సెలవు ఉంటుంది. అంటే వారానికి ఆరు రోజుల పాటు బ్యాంకులు పని చేస్తున్నాయి. అయితే వారానికి రెండు రోజుల పాటు సెలవు ఉండాలని, కేవలం వారంలో ఐదు రోజుల పాటు పని దినాలు ఉండాలని బ్యాంకు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది..

Bank Rules: బ్యాంకుల ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని.. ఎప్పుడు అమల్లోకి వస్తుంది?
Subhash Goud
|

Updated on: Dec 16, 2024 | 4:57 PM

Share

భారతదేశంలోని బ్యాంకులకు 5 రోజులు పని చేయడంపై చర్చ మళ్లీ ప్రారంభమైంది. 5 రోజుల పని అమలుపై చర్చ మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం బ్యాంకులు వారానికి ఆరు రోజులు పనిచేస్తుండగా, రెండో, నాలుగో శనివారాల్లో సెలవులు ఉంటాయి. బ్యాంకు ఉద్యోగులకు 5 రోజులు పని చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే దీనిని డిసెంబర్ 2024 లో అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ, ఈ ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం వేచి ఉంది.

ప్రతిపాదన ఏమిటి?

బ్యాంకుల అతిపెద్ద సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) అనేక సార్లు 5 రోజుల పనిని ప్రతిపాదించాయి. గ్లోబల్ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. పనితీరును రూపొందించడం, ఉద్యోగుల శ్రేయస్సును మెరుగుపరచడం, ఉత్పాదకతను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. డిసెంబరు 2023లో IBA, బ్యాంక్ యూనియన్‌ల మధ్య అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేశాయి. ఇందులో 5 రోజుల పని కోసం ప్రతిపాదన కూడా ఉంది. దీని తర్వాత, 8 మార్చి 2024న, ఐబీఏ, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) 9వ ఉమ్మడి నోట్‌పై సంతకం చేశాయి. ఈ నోట్‌లో శని, ఆదివారం సెలవులతో 5 రోజుల పనిని అమలు చేయడానికి బ్లూప్రింట్ సమర్పించారు.

వినియోగదారులపై ప్రభావం

ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే, బ్యాంకు శాఖలను సందర్శించేందుకు కస్టమర్లు ముందుగానే తమ ప్రణాళికలను మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కస్టమర్లు సమస్యలను ఎదుర్కోవచ్చు. అయితే, 5 రోజులు పని చేయడం వల్ల కస్టమర్ సర్వీస్ అవర్స్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని బ్యాంకు యూనియన్లు హామీ ఇచ్చాయి. ఇందుకోసం బ్యాంకు శాఖల సమయాన్ని దాదాపు 40 నిమిషాలు పెంచడంతోపాటు డిజిటల్ సేవలను బలోపేతం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

5 రోజుల పని ప్రణాళిక అమలులో అనేక సవాళ్లు:

  1. ఆమోదం: ఈ మార్పు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి.
  2. బ్యాంకింగ్ సేవ: భారతదేశం వంటి పెద్ద, విభిన్నమైన దేశంలో నిరంతరాయంగా బ్యాంకింగ్ సేవలను నిర్వహించడం పెద్ద పని.
  3. యూనియన్, మేనేజ్‌మెంట్ ఏకాభిప్రాయం: పని గంటలు, జీతం, ఇతర కార్యాచరణ మార్పులకు సంబంధించి ఉద్యోగులు, మేనేజ్‌మెంట్ మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడం చాలా ముఖ్యం.

ఇతర దేశాల్లో బ్యాంకులు ఎన్ని రోజులు పని చేస్తాయి

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో బ్యాంకులు ఇప్పటికే 5 రోజులు పని చేస్తున్నాయి. భారతీయ బ్యాంకులు ఇతర దేశాల బ్యాంకులను ఆదర్శంగా తీసుకుంటున్నాయి.

ఐబీఏ, యూఎఫ్‌బీయూ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టమైన సంకేతాలు రాలేదు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రూపమ్ రాయ్ మాట్లాడుతూ.. యూనియన్ త్వరలో ఉద్యమాన్ని ప్లాన్ చేస్తుందన్నారు. అలాగే, యూఎఫ్‌బీయూ ఇతర యూనియన్లు, సంఘాలు ఇందులో చేరాలని ఆహ్వానించాయి.

ఇది కూడా చదవండి: Income Tax: మీరు ఈ 5 లావాదేవీలు చేస్తున్నారా? ఆదాయపు పన్ను నోటీసు రావచ్చు.. జాగ్రత్త!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి