Bank Loans: కరోనా రెండో వేవ్ సమయంలో పెరిగిన వెహికల్ లోన్స్..బంగారం తాకట్టు కూడా ఎక్కువే!
జూన్‌లో, రెండవ కోవిడ్ వేవ్ సమయంలో గత సంవత్సరం కంటే 11.9% ఎక్కువ వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు.
Bank Loans: జూన్‌లో, రెండవ కోవిడ్ వేవ్ సమయంలో గత సంవత్సరం కంటే 11.9% ఎక్కువ వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. దీనిలో బంగారంపై రుణాలతో పాటూ వాహన రుణాలూ ఉన్నాయి. దీని అర్థం, ప్రజలు జూన్‌లో కోవిడ్ లేదా ఇతర సమస్యల కారణంగా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం ద్వారా ఎక్కువ రుణాలు తీసుకున్నారు. కానీ, అదే నెలలో ప్రజలు వాహనాలు కొనడానికి కూడా ఎక్కువ రుణాలు తీసుకున్నారు. ఈ విషయాలు రిజర్వ్ బ్యాంక్ కు సంబంధించిన బ్యాంక్ క్రెడిట్ సెక్టోరల్ డిప్లాయిమెంట్ – జూన్ 2021 నివేదికలో వెల్లడి అయ్యాయి. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం, వ్యక్తిగత రుణాల వార్షిక వృద్ధి గత ఏడాది జూన్‌లో 10.4%గా ఉంది.
నాన్ ఫుడ్ బ్యాంక్ రుణం జూన్‌లో 5.9% పెరిగింది
33 వాణిజ్య బ్యాంకుల నుండి బ్యాంకు రుణ డేటా సేకరించారు. ఇది దాదాపు 90% రుణాలను ఆహారేతర రుణంగా పంపిణీ చేసింది. ఆహారేతర బ్యాంకు రుణాలలో వార్షిక వృద్ధిని పరిశీలిస్తే, జూన్‌లో ఇది 6.0% నుండి 5.9% పెరిగినట్లు తెలుస్తోంది.
బ్యాంకు రుణ వృద్ధిలో మంచి విషయం ఏమిటంటే, ఈ కాలంలో, వ్యవసాయం, దాని అనుబంధ పనుల కోసం వార్షిక ప్రాతిపదికన 11.4% ఎక్కువ రుణాలు తీసుకున్నారు. గత సంవత్సరం, కోవిడ్ ప్రారంభంలో అంటే జూన్‌లో 2.4% పెరుగుదల ఉంది.
పరిశ్రమకు బ్యాంకు రుణాలలో 0.3% తగ్గింపు
ఈ ఏడాది జూన్‌లో పరిశ్రమపై బ్యాంకు రుణాలు 0.3% క్షీణించాయి. అయితే గత ఏడాది జూన్‌లో 2.2% పెరిగాయి. మీడియం ఎంటర్‌ప్రైజెస్ గత సంవత్సరం 9% తగ్గుదలతో పోలిస్తే జూన్‌లో 54.6% ఎక్కువ రుణాలు పొందాయి.
సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (MSME లు) బ్యాంక్ రుణాలు 6.4% వృద్ధి చెందాయి, ఇది ఒక సంవత్సరం క్రితం జూన్‌లో 2.9% తగ్గింది. అయితే, ఈ జూన్‌లో, పెద్ద కంపెనీలు 3.4% తక్కువ రుణాలు పొందాయి, గత సంవత్సరం ఇదే కాలంలో 3.6% ఎక్కువ రుణాలు వచ్చాయి.
సేవల రంగం రుణ వృద్ధి 2.9% కి తగ్గింది
వాణిజ్య రియల్ ఎస్టేట్, NBFC లు మరియు టూరిజం, హోటళ్లు మరియు రెస్టారెంట్ల నుండి తక్కువ డిమాండ్ కారణంగా సేవల రంగం రుణ వృద్ధి గత సంవత్సరం జూన్‌లో 10.7% నుండి 2.9% కి తగ్గింది.
మంచి విషయం ఏమిటంటే, ప్రభుత్వ-మద్దతు ఉన్న అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS), MSME లకు ఉపశమన ప్యాకేజీగా అందిస్తున్నారు. ఇది పరిశ్రమ రుణ వృద్ధిని పెంచింది, లేకుంటే అది ప్రతికూలంగా మారి ఉండేది.
రెండు రకాల రుణాలు ఉన్నాయి
బ్యాంకులు ఇచ్చే రుణాలు రెండు రకాలుగ ఉంటాయి. ఫుడ్ క్రెడిట్ అలాగే, నాన్-ఫుడ్ క్రెడిట్. ఆహార ధాన్యాల కొనుగోలు కోసం బ్యాంకులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కి ఇచ్చే రుణాన్ని ఫుడ్ క్రెడిట్ అంటారు. బ్యాంకుల మొత్తం రుణంలో ఆహార క్రెడిట్ వాటా చాలా తక్కువ. బ్యాంకు రుణాలలో అత్యధిక భాగం ఆహారేతర క్రెడిట్ ఖాతాలు. ఇది వ్యవసాయం, పరిశ్రమ,సేవల వంటి ఆర్థిక రంగాలకు ఇస్తారు.
Also Read: Gold Loan: నిమిషాల్లోనే బంగారంపై రుణాలు.. వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు ఇవే..!