Gold Loan: నిమిషాల్లోనే బంగారంపై రుణాలు.. వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు ఇవే..!
Gold Loan: ప్రజలకు అత్యవసరంగా డబ్బులు కావాలంటే ఉపయోగపడేది బంగారం. దీనిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నిమిషాల్లో డబ్బులు పొందవచ్చు. భారతీయులు బంగారానికి..
Gold Loan: ప్రజలకు అత్యవసరంగా డబ్బులు కావాలంటే ఉపయోగపడేది బంగారం. దీనిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నిమిషాల్లో డబ్బులు పొందవచ్చు. భారతీయులు బంగారానికి ఎంత విలువ ఇస్తుంటారో.. అత్యవసర సమయాల్లో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంటుంది. సమయానికి డబ్బులు కావాల్సి వస్తే ఆదుకునే అభరణం. బంగారం విషయంలో భారత ప్రజలకు ఎక్కువగా భావోద్వేగపరమైన సంబంధం ఉంటుంది. అందుకే ప్రజలు ఎక్కువగా బంగారం అమ్మటానికి ఇష్టపడరు. ఒకవేళ ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తారు. మన దేశంలో ప్రజలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బంగారాన్ని తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు. కరోనా సమయంలో పలు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి ఆదాయం పొందుతున్నాయి. సాధారణంగా వ్యక్తిగత రుణాల కంటే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తుంటాయి. బంగారం తాకట్టు పెట్టుకొని బ్యాంకులు కూడా చాలా వేగంగా రుణాలు ఇవ్వడానికి చూస్తాయి. అయితే వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. సిబిల్ స్కోర్ తో పనిలేదు. వివిధ రకాల బ్యాంకుల్లో బంగారు రుణాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వివరాలు మై లోన్‌కేర్, ఇతర వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయని గమనించగలరు. అయితే బంగారంపై తీసుకునే లోన్, కాలపరిమితిని బట్టి కూడా వడ్డీ రేటు మారే అవకాశాలుంటాయి.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 7.50 శాతం * పంజాబ్ అండ్ సింధు బ్యాంకు – 7 శాతం * బ్యాంక్ ఆఫ్ ఇండియా – 7.35 శాతం * హెచ్‌డీఎఫ్‌సి బ్యాంకు-9.50 శాతం. * బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 7.50 శాతం * కెనరా బ్యాంకు – 7.65 శాతం * బ్యాంక్ ఆఫ్ జమ్మూఅండ్ కశ్మీర్ – 8.90 శాతం * సెంట్రల్ బ్యాంక్ -9.50 శాతం * ఇండియన్ బ్యాంకు – 8.50 శాతం * పంజాబ్ నేషనల్ బ్యాంకు – 8.75 శాతం *యూనియన్ బ్యాంకు – 8.85 శాతం * ఇండియా ఓవర్‌సిస్ బ్యాంక్ – 9.25 శాతం * బ్యాంక్ ఆఫ్ బరోడా – 9.60 శాతం * కోటాక్ మహింద్రా బ్యాంకు -10.50 శాతం * యస్‌బ్యాంక్ – 9.99 శాతం * యాక్సిస్ బ్యాంకు-13 శాతం * ఐసీఐసీఐ బ్యాంకు – 10 శాతం * ఆంధ్రా బ్యాంకు – 7.60 శాతం * ముత్తూట్ ఫైనాన్స్ – 11.99 శాతం * మన్నపురం ఫైనాన్స్ -12 శాతం