Game Changer : రామ్ చరణ్ యాక్టింగ్.. శంకర్ రియాక్షన్స్.. గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో చూశారా.. ? హైలెట్ అదే..
డైరెక్టర్ శంకర్ తొలిసారిగా తెలుగులో దర్శకత్వం వహిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అలాగే కోలీవుడ్ నటుడు ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. వీరిద్దరి కాంబోలో మొదటిసారి వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఈ సినిమా రేపు (జనవరి 10న) థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా కొన్నిరోజులుగా గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇటీవలే నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో చరణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. చెర్రీతోపాటు హీరో శర్వానంద్, నిర్మాత దిల్ రాజు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ జనవరి 8 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో గేమ్ ఛేంజర్ గ్రాండియర్ గా కనిపిస్తుంది. డైరెక్టర్ శంకర్ నుంచి హీరో రామ్ చరణ్, అంజలి, కియారా అద్వానీ, ఎస్ జే సూర్య నుంచి టెక్నీషియన్స్, ఇతర టీం సభ్యులు ఎంతగా హార్ట్ వర్క్ చేశారో కనిపిస్తుంది. ఇక ఇందులో చరణ్ వైవిధ్యమైన లుక్స్ తో కనిపించారు. అలాగే ఈసినిమా కోసం డైరెక్టర్ శంకర్ ఎంతగా కష్టపడ్డారు.. ఎంతగా డెడికేషన్ చూపించారు అనేది ఈ వీడియోలో చూపించారు.
చరణ్, డైరెక్టర్ శంకర్ నవ్వులు.. చివర్లో చరణ్ యాక్టింగ్ చూసి శంకర్ ఇచ్చిన రియాక్షన్ ఈ వీడియోకే హైలెట్ అయ్యిందనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ మేకింగ్ వీడియో చూసి సినిమా ఓ రేంజ్ లో ఉండడం ఖాయమని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రేపు అడియన్స్ ముందుకు రానుంది.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.