Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Report: బ్యాంకు రుణం మంజూరు కాలేదా..? అదే అసలు కారణం

ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఎప్పటి కప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని రోగాలు రాకుండా జాగ్రత్తలు పడతారు. ఏవైనా వచ్చే అవకాశం కనిపిస్తే ముందుగానే మందులు వాడతారు. తద్వారా రోగాలు తీవ్రస్థాయికి చేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కానీ ఇదే విధానం క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసుకోవడానికి అవలంబించరు. తద్వారా అత్యవసర సమయంలో బ్యాంకు రుణాలకు చేసిన దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ రిపోర్టు అనేది జీవితంలో ఎంత ముఖ్యమో తెలుసుకుందాం.

Credit Report: బ్యాంకు రుణం మంజూరు కాలేదా..? అదే అసలు కారణం
ప్రతి వ్యక్తికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. మీకు మంచి స్కోర్ ఉంటే, మీకు సులభంగా రుణం లభిస్తుంది. మీకు అత్యవసరంగా పర్సనల్ లోన్ అవసరమైతే క్రెడిట్ స్కోర్ ఉపయోగపడుతుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీ రేట్లకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కెరీర్‌ను ప్రారంభించే యువకులు క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఇప్పుడు రుణం అవసరం లేకపోయినా, భవిష్యత్తులో ఆర్థిక ఆరోగ్యానికి చిహ్నంగా మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండటం ముఖ్యం. ఈ నేపథ్యంలో, క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడానికి ఎవరైనా కొన్ని సాధారణ చిట్కాలను అవలంబించవచ్చు.
Follow us
Srinu

|

Updated on: Feb 06, 2025 | 4:15 PM

మీ క్రెడిట్ రిపోర్టును చివరిగా ఎప్పుడు తనిఖీ చేశారని ప్రశ్నిస్తే చాాలా మంది నుంచి గుర్తు లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే వారు దాన్ని పరిశీలించి ఎంతో కాలం గడిచిపోయి ఉంటుంది. కొందరైతే ఒక్కసారి కూడా చూసుకుని ఉండరు. సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల రోగాలు ముదురుపోతున్నట్టే.. క్రెడిట్ రిపోర్టు చూసుకోకపోవడం వల్ల పలు ఇబ్బందులు కలుగుతాయి. దానిలో చిన్న పొరపాట్ల కారణంగా బ్యాంకు రుణాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా సొంత ఇల్లు, కారు, ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేసినప్పుడు రుణాల కోసం బ్యాంకులో దరఖాస్తు అందిస్తాం. జీతం బాగానే వస్తున్న కారణంగా వాయిదాలు చెల్లించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి బ్యాంకు వెంటనే రుణం మంజూరు చేస్తుందని సంబర పడతాం. కానీ రుణ దరఖాస్తు తిరస్కరణకు గురైనట్టు సమాచారం వస్తుంది. ఎందుకని ఆరా తీస్తే క్రెడిట్ రిపోర్టు సక్రమంగా లేదని సమాధానం వినిపిస్తుంది.

మన క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్టు ఆధారంగానే బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. క్రెడిట్ స్కోర్ అంటే మీ యోగ్యతను తెలిపే మూడు అంకెల సంఖ్య. అది మీ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. క్రెడిట్ రిపోర్టు అంటే మీ క్రెడిట్ చరిత్ర, చెల్లించాల్సిన అప్పులు, క్రెడిట్ కార్డు వినియోగం తదితర వాటితో మీ ఆర్థిక డేటా, గతంలో రుణాలను తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ ను రూపొందించడానికి క్రెడిట్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటారు. క్రెడిట్ రిపోర్టు సక్రమంగా లేకపోవడానికి చాలా చిన్నతప్పులు కారణమవుతాయి.

పాత ఖాతాలను గడువు దాటినట్టు లేబుల్ చేయడం, చిన్నచిన్న చెల్లింపులు తప్పిపోవడం అంటే పాత క్రెడిట్ కార్డుకు సంబంధించి చెల్లించని వంద రూపాయలు కూడా కారణమవుతుంది. కొన్ని సార్లు మీరు తీసుకోని రుణాలు కూడా తప్పుగా మీ ఖాతాకు అనుసంధానమవుతాయి. అలాగే క్రెడిట్ కార్డును పరిమితికి మించి వాడడం వల్ల కూడా సమస్య వస్తుంది. క్రెడిట్ రిపోర్టును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. చిన్న పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలి. తప్పుగా ఏవైనా రుణాలకు మీకు కలిస్తే బ్యాంకు అధికారులను సంప్రదించాలి. క్రెడిట్ రిపోర్టు ఎప్పుడు బాగుండేలా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజ్ తరుణ్ అనుకుంటే కళ్యాణ్ రామ్ వచ్చేశాడు..
రాజ్ తరుణ్ అనుకుంటే కళ్యాణ్ రామ్ వచ్చేశాడు..
తెలంగాణంలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రత్యేక యాప్
తెలంగాణంలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రత్యేక యాప్
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. బ్రేక్ కోసం చూస్తోన్న చెల్లెలు
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. బ్రేక్ కోసం చూస్తోన్న చెల్లెలు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్
షారుఖ్, అక్షయ్ రిజెక్ట్ చేసిన సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న అజయ్
షారుఖ్, అక్షయ్ రిజెక్ట్ చేసిన సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న అజయ్
ఇంటర్‌లో ద్వితీయ భాషగా సంస్కృతం.. మండిపడుతున్న జనాలు!
ఇంటర్‌లో ద్వితీయ భాషగా సంస్కృతం.. మండిపడుతున్న జనాలు!
DC vs RR: ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోనున్న పింక్ పాంథర్?
DC vs RR: ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోనున్న పింక్ పాంథర్?