Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toll Plaza: హై-స్పీడ్ హైవేలలో టోల్ అడ్డంకులకు వీడ్కోలు.. త్వరలో కొత్త ఫీచర్‌

Toll Plaza: రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం.. 2025-26 నాటికి 10,000 కి.మీ.లలో బారియర్-ఫ్రీ టోలింగ్‌ను ప్రారంభించాలని భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఐదు సంవత్సరాలలో నాలుగు లేన్లు లేదా అంతకంటే ఎక్కువ జాతీయ రహదారులు

Toll Plaza: హై-స్పీడ్ హైవేలలో టోల్ అడ్డంకులకు వీడ్కోలు.. త్వరలో కొత్త ఫీచర్‌
Follow us
Subhash Goud

|

Updated on: Feb 06, 2025 | 2:35 PM

రాబోయే ఐదు సంవత్సరాలలో నాలుగు లేన్లు లేదా అంతకంటే ఎక్కువ జాతీయ రహదారులు, అన్ని హై-స్పీడ్ కారిడార్లలో ఎలాంటి అడ్డంకులు లేని టోలింగ్‌ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక సర్వే తెలిపింది. దీంతో ప్రయాణికులు ఛార్జీలు చెల్లించడానికి ఆగాల్సిన అవసరం లేదు. వేగాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. ఇది సజావుగా ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది. దాదాపు 1.5 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారుల్లో, దాదాపు 46,000 కిలోమీటర్లు నాలుగు లేన్లు లేదా అంతకంటే ఎక్కువ. దాదాపు 2,500 కి.మీ. హైవేలు హై-స్పీడ్ కారిడార్లు ఉన్నాయి.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం.. 2025-26 నాటికి 10,000 కి.మీ.లలో బారియర్-ఫ్రీ టోలింగ్‌ను ప్రారంభించాలని భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) లక్ష్యంగా పెట్టుకుంది. బారియర్-ఫ్రీ టోలింగ్‌లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్‌లు, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ల వద్ద హై-రిజల్యూషన్ కెమెరాల వాడకం, శాటిలైట్‌ ఆధారిత టోలింగ్, మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) వ్యవస్థ వంటి సాంకేతికతలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, పానిపట్-అంబాల హైవేపై పైలట్ ప్రాతిపదికన ANPR ఆధారిత టోలింగ్ అమలు చేయబడింది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీలోని UER-II, గుజరాత్‌లోని చోరయాసి, హర్యానాలోని ఘరౌండా, తమిళనాడులోని నీమిలిలలో ఉన్న ఐదు టోల్ ప్లాజాలలో సజావుగా టోలింగ్ చేసే MLFF వ్యవస్థ కోసం NHAI బిడ్లను ఆహ్వానించింది.

అహ్మదాబాద్-ధోలేరా, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేల కోసం బిడ్ తయారీ జరుగుతోంది. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ, NH కారిడార్‌లలో సజావుగా ప్రయాణం జరిగేలా చూడాలని రహదారుల మంత్రిత్వ శాఖను ఆదేశించారని వర్గాలు తెలిపాయి.

త్వరలో అమలులోకి రానున్న టోల్ పాస్ వ్యవస్థ:

మధ్యతరగతి ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం త్వరలో వార్షిక టోల్ పాస్, హైవేలపై ప్రయాణించే ప్రజల కోసం జీవితకాల టోల్ పాస్ సౌకర్యాన్ని ప్రారంభించనుంది. ఈ రెండు టోల్ పాస్‌లు జాతీయ రహదారిపై తరచుగా ప్రయాణించే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు వార్షిక టోల్ పాస్ కోసం ఒకసారి రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. రూ.3,000 చెల్లింపు తర్వాత మీరు ఈ పాస్‌ను అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో మీరు 15 సంవత్సరాల పాటు జీవితకాల పాస్ పొందుతారు. ఈ టోల్ పాస్ కోసం మీరు రూ.30,000 చెల్లిస్తారు.

ఇది ఎప్పుడు అమలు అవుతుంది?

ఈ ప్రతిపాదన రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వద్ద ఇంకా అధునాతన దశలో ఉందని వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ వాహనాలకు కిలోమీటరుకు ప్రాథమిక టోల్ రేటును తగ్గించాలని మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని, ఇది జరిగితే హైవేపై ప్రయాణించే ప్రజలకు ఉపశమనం లభిస్తుంది అని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. పాస్‌ను FASTagలో పొందుపరిచినందున పాస్‌ను కొనుగోలు చేయడానికి ప్రత్యేక కార్డును కొనుగోలు చేయవలసిన అవసరం లేదు.

వార్షిక టోల్ పాస్, జీవితకాల టోల్ పాస్ సౌకర్యం ఎప్పుడు ప్రారంభించబడుతుందనే దాని గురించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ సౌకర్యం త్వరలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి