Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio AirFiber: జియో అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. రూ.599కే ఇంటర్నెట్‌, 12 ఓటీటీలు, 800కుపైగా టీవీ ఛానళ్లు!

Jio AirFiber: మీరు కేబుల్ టీవీ కోసం అదనంగా బిల్లు చెల్లించకూడదని అనుకుంటే మీకోసమే జియో ఇప్పుడు నెలకి కేవలం రూ.599కే అదిరిపోయే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ తీసుకుంటే కేబుల్‌టీవీలతో పని ఉండదు. మున్ముందు కేబుల్‌ టీవీల వ్యవస్థ మునిగిపోనుంది..

Jio AirFiber: జియో అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. రూ.599కే ఇంటర్నెట్‌, 12 ఓటీటీలు, 800కుపైగా టీవీ ఛానళ్లు!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 06, 2025 | 3:29 PM

మున్ముందు కేబుల్‌ టీవీల వ్యవస్థ మునిగిపోనుంది. గతంలో టీవీ ఛానళ్లు కావాలంటే కేబుల్‌ టీవీ ఆపరేటర్లను సంప్రదించాల్సి ఉండేది. కానీ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మరింత సులభంగా మారిపోతోంది. మీరు కేబుల్ టీవీ కోసం అదనంగా బిల్లు చెల్లించకూడదని అనుకుంటే మీకోసమే జియో ఇప్పుడు నెలకి కేవలం రూ.599కే అదిరిపోయే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ తీసుకుంటే కేబుల్‌టీవీలతో పని ఉండదు.

  1. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌: ఈ జియో ప్లాన్‌లో భాగంగా మీకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి యాక్సెస్, ఇంకా 800లకు పైగా లైవ్ టీవీ ఛానళ్లు కూడా వస్తాయి. మీ ఇంటికి సరసమైన ధరలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే, ఈ జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ చాలా మంచి ఆప్షన్.
  2. రూ.599 ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌ ప్రయోజనాలు ఏంటి?: జియో ఎయిర్‌ఫైబర్‌లో చాలా తక్కువ ధర కలిగిన ప్లాన్‌. ఇది 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. కావాలంటే 6 నెలలు లేదా 12 నెలల ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 30 Mbps వరకు స్పీడ్‌తో ఇంటర్నెట్ వస్తుంది. దీంతో బ్రౌజింగ్, స్ట్రీమింగ్, గేమింగ్స్‌ ఉంటాయి.
  3. నెలకి 1000GB డేటా: ఇందులో నెలకు 1000జీబీల డేటా ఉంటుంది. డేటా అయిపోతుందనే టెన్షన్ ఉండదు. 12 పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఫ్రీ యాక్సెస్ వస్తుంది. వాటిలో డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్ (Sony Liv), జీ5 (ZEE5), జియో సినిమా, సన్ నెక్స్ట్ (Sun NXT), హోయిచోయి (Hoichoi), డిస్కవరీ+ (Discovery+), ఆల్ట్‌బాలాజీ (ALTBalaji) ఉన్నాయి. ఈరోస్ నౌ (Eros Now), లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play), షెమరూమీ (ShemarooMe), డాక్యుబే (DocuBay), ఎపిక్ఆన్ (EPIC ON) వంటి ఇతర ఓటీటీలు కూడా ఇదే ప్లాన్‌లో ఉచితంగా యాక్సెస్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అంతే కాకుండా 800కుపైగా టీవీ ఛానెళ్లు వస్తాయి. ఇందులో మీకు సెటప్‌ బాక్స్‌ను ఉచితంగా అందిస్తుంది.
  4. వేర్వేరు ప్లాన్స్‌: జియో ఈ ప్లాన్‌ను తీసుకోవడానికి వేర్వేరు పేమెంట్ ఆప్షన్లు ఇస్తోంది. 3 నెలల ప్లాన్ తీసుకుంటే ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు రూ.1,000 ఉంటాయి. 6 నెలల ప్లాన్ కోసం 6 నెలలకు కలిపి మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు రూ.500 మాత్రమే.12 నెలలకు కలిపి చెల్లింపులు చేస్తే, ఇన్‌స్టాలేషన్ పూర్తిగా ఉచితం.
  5. 12 నెలల ప్లాన్‌ తీసుకుంటే నెల ఉచితం: అలాగే మీరు 12 నెలల ప్లాన్ తీసుకుంటే ఒక నెల పాటు సర్వీస్ ఉచితంగా అందిస్తారు. అంటే మొత్తం 13 నెలలు ఉంటుంది.
  6. జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ తీసుకోవడం ఎలా? : మీరు ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే, ఈ కింద ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి చేయవచ్చు.60008-60008 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. జియో వాళ్లే మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే జియో వెబ్‌సైట్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి