Bank Holidays In November 2022: వచ్చే నెలలో బ్యాంకులకు 10 రోజులు సెలవులు.. ఏయే రోజు అంటే..
నవంబర్ నెల వచ్చేస్తోంది. ముఖ్యంగా ప్రతి రోజు బ్యాంకుల పని నిమిత్తం వెళ్లే వారు చాలా మంది ఉంటారు. అలాంటి సమయంలో నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ముందస్తుగా..
నవంబర్ నెల వచ్చేస్తోంది. ముఖ్యంగా ప్రతి రోజు బ్యాంకుల పని నిమిత్తం వెళ్లే వారు చాలా మంది ఉంటారు. అలాంటి సమయంలో నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ముందస్తుగా గమనించుకుంటే మంచిది. సెలవులను గమనించడం వల్ల బ్యాంకు పనులపై ప్లాన్ చేసుకోవచ్చు. ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అయితే ఈ సెలవులను అన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని విడుదల చేస్తుంటుంది. ఇవి రాష్ట్రాల బట్టి ఉంటాయని గమనించాలి. ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నా.. నిత్యం ఏదో ఒక బ్యాంకు పని నిమిత్తం చాలా మంది వెళ్తుంటారు. నవంబర్ నెలలో బ్యాంకులకు 10 రోజుల పాటు సెలవులు రానున్నాయి. బ్యాంకు కస్టమర్లు ముందస్తు ప్లాన్ చేసుకుంటే మంచిది. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ బ్యాంకు సెలవులలో రెండో శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. మరి నవంబర్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోండి.
1. నవంబర్ 1న – కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం, బెంగళూరు, ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు
2. నవంబర్ 6 – ఆదివారం
3. నవంబర్ 8 – గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి..అగర్తల, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కోచి, పాణాజి, పాట్నా, షిల్లాంగ్, తిరువనంతపురంలో సెలవు
4. నవంబర్ 11 – కనకదాస జయంతి-వంగల పండుగ..బెంగళూరు, షిల్లాంగ్‌లో సెలవు
5 నవంబర్ 12 – రెండో శనివారం
6 నవంబర్ 13 ఆదివారం
7 నవంబర్ 20 – ఆదివారం
8 నవంబర్ 23 – సేంగ్ పండగ (షిల్లాంగ్‌లో సెలవు)
9 నవంబర్ 26- నాలుగో శనివారం
10. నవంబర్ 27 – ఆదివారం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి