Cancer Shampoo: షాకింగ్‌ న్యూస్‌.. మీరు ఈ షాంపూలు వాడుతున్నారా? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం.. వెల్లడించిన ఎఫ్‌డీఏ

చాలా మంది స్నానం చేసేటప్పుడు జుట్టు కోసం రకరకాల షాంపులను వాడుతుంటారు. అలాగే టీవీల్లో, ఇంటర్నెట్‌లో యాడ్స్‌ను చూసి కూడా చాలా మంది షాంపులను వాడుతుంటారు. మార్కెట్లో రకరకాల..

Cancer Shampoo: షాకింగ్‌ న్యూస్‌.. మీరు ఈ షాంపూలు వాడుతున్నారా? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం.. వెల్లడించిన ఎఫ్‌డీఏ
Shampoo Causing Cancer
Follow us
Subhash Goud

|

Updated on: Oct 26, 2022 | 8:02 AM

చాలా మంది స్నానం చేసేటప్పుడు జుట్టు కోసం రకరకాల షాంపులను వాడుతుంటారు. అలాగే టీవీల్లో, ఇంటర్నెట్‌లో యాడ్స్‌ను చూసి కూడా చాలా మంది షాంపులను వాడుతుంటారు. మార్కెట్లో రకరకాల షాపుల అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కొన్ని షాంపులు ప్రమాదకరంగా ఉంటాయి. జుట్టు రాలిపోవడమే కాకుండా కొన్ని ఆనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంటాయి. అందుకు షాంపులు వాడే ముందు అందులో ఎలాంటి కెమికల్స్‌ కలిశాయి.. ఏయే వస్తువులతో షాంపు తయారైందనే విషయం గమనిస్తుండటం ఎంతో ముఖ్యం. పూర్వ కాలంలో కుకుడు కాయలను నానబెట్టి వాటి నుంచి వచ్చే నురుగుతో తలరుద్దుకునేవారు. కానీ ఆధునిక కాలంలో కొత్త కొత్త షాంపులను వాడుతూ సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. తాజాగా కొన్ని షాంపుల కారణంగా క్యాన్సర్‌ వ్యాధి వస్తుందని గుర్తించారు పరిశోధకులు. డ్రై షాంపూ ఉత్పత్తులైన డోవ్‌, నెక్సస్‌, ట్రెస్మె, టిగీ, సువావేలలో క్యాన్సర్‌ కెమికల్‌ ఉందని హిందూస్థాన్‌ యూనిలీవర్ గుర్తించడం ఇప్పుడు అందరికి షాక్‌కు గురి చేస్తోంది. ఈ దెబ్బతో మార్కెట్‌ నుంచి భారీగా షాంపులను కంపెనీ రీకాల్‌ చేసింది. ఏరోసోల్‌ డ్రై షాంపు ప్రొడక్టులు చాలా ప్రమాదమని, వాటిని వాడవద్దని వినియోగదారులను హెచ్చరించింది.

యూనిలీవర్‌కు చెందిన అనేక షాంపూ బ్రాండ్లలో బెంజీన్‌ అనే క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదకరమైన రసాయనం ఉందని గుర్తించారు. డోవ్‌, నెక్సస్‌, సువే, టిగితో సహా ట్రెస్మెమ్మె ఏరోసోల్‌లతో సహా యూఎస్‌ మార్కెట్‌ నుంచి కంపెనీ అనేక డ్రై షాంపూలను రీకాల్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌లో పోస్టు చేసిన నోటీసు ప్రకారం.. యూనిలీవర్‌ ఉత్పత్తులు అక్టోబర్‌ 2021కి ముందు తయారు చేయడం జరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రిటైలర్లకు సప్లై చేసినట్లు తెలిపింది.

డ్రై షాంపూ అంటే ఏమిటి?

డ్రై షాంపూ అంటే ఒక పౌడర్‌ లేదా స్ప్రే లాంటిది. ఈ ఉత్పత్తులు సాధారణంగా జుట్టును తడి చేయకుండా శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారని చెబుతున్నారు. క్లీవ్‌ ల్యాండ్‌ అనే ఒక హెయిర్‌ క్లినిక్‌ వివరాల ప్రకారం.. ఈ ఆల్కహాల్‌, స్టార్చ్‌ ఆధారిత స్ప్రేలు జుట్టు నుంచి జిడ్డు, నూనెను తొలగిస్తాయట. అయితే కొన్ని డ్రై షాంపూలలో ఏరోసోల్‌ స్ప్రే ఉంటుంది. మరికొన్ని షాంపూలలో జుట్టు రంగుకు సరిపోయేలా పౌడర్‌ లేతరంగులో ఉంటుందట. ఇందులో ఉండే రసాయనాలు మన ముక్కు ద్వారా, నోటీ ద్వారా శర్మం ద్వారా శరీంలోకి ప్రవేశించి బ్లడ్‌ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) హెచ్చరించింది. ఏమైనా సందేహాలు ఉంటే UnileverRecall.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎఫ్‌డీఏ సూచించింది.

ఇవి కూడా చదవండి

కాగా, గత 18 నెలల్లో ఏరోసోల్ సన్‌స్క్రీన్‌లు మార్కెట్ ప్రొడక్టులు వెనక్కి రప్పించాయి. ఇందులో ముఖ్యంగా జాన్సన్ & జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కంపెనీ బనానా బోట్, బీర్స్‌డార్ఫ్ AG యొక్క కాపర్‌టోన్ వంటి అనేక ఏరోసోల్ సన్‌స్క్రీన్‌లు రీకాల్‌ చేయబడినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.

Source

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!