Bank Holidays: బ్యాంకుల్లో పనుంటే ఇలా ప్లాన్ చేసుకోండి.. ఆగస్టు నెలలో 8 రోజుల సెలవులు..
Bank Holiday in August 2021: మీకు మే నెలలో బ్యాంకుల్లో ఏమైనా పనులుంటే.. ఇప్పుడే మీరు పూర్తిచేసుకోవడం మంచిది. ఎందుకంటే.. వచ్చే నెల ఆగస్టులో వరుసగా బ్యాంకులకు సెలవులున్నాయి.
మీకు మే నెలలో బ్యాంకుల్లో ఏమైనా పనులుంటే.. ఇప్పుడే మీరు పూర్తిచేసుకోవడం మంచిది. ఎందుకంటే.. వచ్చే నెల ఆగస్టులో వరుసగా బ్యాంకులకు సెలవులున్నాయి. ఈ నెలలో మొత్తం 10 రోజులు సెలవులు వస్తున్నాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగదారులకు ఇబ్బంది లేకున్నా.. అయితే, చెక్ క్లియరెన్స్, రుణాలు పొందేవారు మాత్రం ముందుగా ప్లాన్ చేసుకోవాలి. మీరు బ్యాంకు కోసం ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆ రోజు బ్యాంక్ తెరిచి ఉందో లేదో మీరు తెలుసుకోవాలి. ఆగస్టు నెలలో వచ్చే సెలవుల గురించి ఒకసారి పరిశీలిద్దాం..
ఆగష్టు 1, 2021: ఆదివారం యధావిధిగా బ్యాంకులకు సెలవుదినం.
ఆగష్టు 8, 2021: ఆదివారం యధావిధిగా బ్యాంకులకు సెలవుదినం.
ఆగష్టు 13, 2021: ఈ రోజు Patriot’s Day కావడంతో, ఇంఫాల్ జోన్‌లో బ్యాంక్ సెలవు ఉంటుంది.
ఆగష్టు 14, 2021: ఈ రోజు రెండవ శనివారం సెలవు.
ఆగష్టు 15, 2021: ఆదివారం యధావిధిగా బ్యాంకులకు సెలవుదినం.
ఆగష్టు 16, 2021: ఈ రోజు పార్సీ నూతన సంవత్సరం కారణంగా, మహారాష్ట్రలోని బేలాపూర్, ముంబై, నాగ్పూర్ మండలాల్లో బ్యాంక్ సెలవు ఉంటుంది.
ఆగష్టు 19, 2021: ఈ రోజు మొహర్రం సెలవుదినం.
ఆగష్టు 20, 2021: ఈ రోజు ఓనం కారణం సెలవు.
ఆగష్టు 21, 2021: తిరువొనం ఈ రోజు కావడంతో, కొచ్చి జోన్ , కేరళలో బ్యాంక్ సెలవు.
ఆగష్టు 22, 2021: ఆదివారం యధావిధిగా బ్యాంకులకు సెలవుదినం.
ఆగష్టు 23, 2021: ఈ రోజు శ్రీ నారాయణ గురు జయంతి కావడంతో, కొచ్చి జోన్, కేరళలో బ్యాంక్ సెలవు ఉంటుంది.
ఆగష్టు 28, 2021: నాలుగో శనివారం సెలవు
ఆగష్టు 29, 2021: ఈ రోజు ఆదివారం కావడంతో, బ్యాంకులకు వారపు సెలవు ఉంటుంది.
ఆగష్టు 30, 2021: ఈ రోజున జన్మాష్టమి కారణంగా బ్యాంక్ సెలవు.
ఆగష్టు 31, 2021: శ్రీ కృష్ణ అష్టమి కారణంగా, ఈ రోజు హైదరాబాద్‌లో బ్యాంక్ సెలవు ఉంటుంది.
ఇదిలావుంటే.. ప్రతి నెల ప్రతి ఆదివారం కాకుండా, రెండవ, నాల్గవ శనివారాలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇది కాకుండా ఆగస్టు నెలలో ఎనిమిది రోజులు బ్యాంకులకు వేర్వేరు ప్రాంతాల్లో హాలిడేస్ ఉన్నాయి. అయితే ఇందులో తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఎనిమిది రోజులు మాత్రమే సెలువులు వర్తించనున్నాయి.