Axis Bank: యాక్సిస్ భారీ పెట్టుబడి నిర్ణయం.. అమెరికన్ బ్యాంక్ ను కొనుగోలు..
Axis Bank: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ దేశంలో అతిపెద్ద బ్యాంక్ గా అవతరించేందుకు ప్రయత్నిస్తోంది. రిటైల్ బ్యాంకింగ్ విభాగంలో తన స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు భారీ పెట్టుబడి ప్రణాళికతో ముందుకు వచ్చింది...
Axis Bank: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ దేశంలో అతిపెద్ద బ్యాంక్ గా అవతరించేందుకు ప్రయత్నిస్తోంది. రిటైల్ బ్యాంకింగ్ విభాగంలో తన స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు భారీ పెట్టుబడి ప్రణాళికతో ముందుకు వచ్చింది. దేశంలో సిటీ బ్యాంక్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు యోచిస్తోంది. ఈ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను మరి కొన్ని వారాల్లో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతులు పొందే ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ డీల్ విలువ 2 బిలియన్ డాలర్లు ఉంటుందని సమాచారం. కొనుగోలు తరువాత కంపెనీ విలీనానికి సుమారు ఆరు నెలల సమయం పట్టనుంది. దీనికి సంబంధించి రెండు బ్యాంకులకు సంబంధించిన అధికారిక వర్గాలు కామెంట్ చేసేందుకు నిరాకరించాయి.
మెుత్తం 13 దేశాల్లో రిటైల్ బ్యాంక్ సేవలు అందిస్తున్న సిటీ గ్రూప్ తన వ్యాపార సరళీకరణ నిర్ణయంలో భాగంగా భారత్ లోని వ్యాపారాన్ని అమ్మాలనుకుంటోంది. కరోనా రెండు వేవ్ ల తరువాత తమ రిటైల్ లోన్ వ్యాపారన్ని మరింతగా విస్తరించాలనుకుంటున్న యాక్సిస్ బ్యాంక్ వ్యూహాత్మకంగా సిటీ బ్యాంక్ ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
Mukesh Ambani: వరుస పెట్టుబడులతో దూసుకుపోతున్న అంబానీ.. తాజాగా ఆ కంపెనీలో వాటాల కొనుగోలు..