FD Interest Rates: ఎఫ్‌డీలపై ఆ బ్యాంకుల్లో ఆకర్షణీయ వడ్డీ రేట్లు.. ఎంతో తెలిస్తే షాకవుతారు..
ప్రస్తుతం అన్ని బ్యాంకులతో పోల్చుకుంటే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీని అందిస్తున్నాయి. ముఖ్యంగా డీసీబీ బ్యాంక్ ఎఫ్‌డీపై ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తుంది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులో అయితే పంజాబ్ & సింద్ బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై ఉత్తమ రాబడిని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల కంటే 50 బీపీఎస్ లేదా అంతకంటే ఎక్కువ అదనపు వడ్డీ రేటును పొందుతారు.
కష్టపడి జీవితాంతం సంపాదించిన సొమ్ము మంచి రాబడి కోసం వివిధ పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. అయితే గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలతో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ గత మూడు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటు యథాతథంగా ఉంచడంతో వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని బ్యాంకులతో పోల్చుకుంటే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీని అందిస్తున్నాయి. ముఖ్యంగా డీసీబీ బ్యాంక్ ఎఫ్‌డీపై ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తుంది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులో అయితే పంజాబ్ & సింద్ బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై ఉత్తమ రాబడిని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల కంటే 50 బీపీఎస్ లేదా అంతకంటే ఎక్కువ అదనపు వడ్డీ రేటును పొందుతారు. కాబట్టి ప్రస్తుతం ఏయే బ్యాంకులు ఎంత మేర వడ్డీను అందిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సాధారణ వినియోగదారుల కోసం ఇది 4.5 శాతం నుంచి 9 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.5 శాతం నుంచి 9.5 శాతం వరకు వడ్డీ రేటును పొందుతారు. డిపాజిట్ వడ్డీ రేటు 9 అక్టోబర్ 2023 నుంచి సవరించారు. ఈ బ్యాంకులో అత్యధిక వడ్డీ రేటు 9 శాతం. ఇది 1001 రోజుల వ్యవధిలో అందిస్తారు.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంకులో ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 4 శాతం నుంచి 8.6 శాతం మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తుంది. ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు 4.5 శాతం నుంచి 9.1 శాతం వరకు వడ్డీ రేటును పొందుతారు. గరిష్టంగా 8.60 శాతం వడ్డీ రేటు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు పైగా అందిస్తారు. ఈ రేట్లు 7 ఆగస్టు 2023 నుండి వర్తిస్తాయి.
డీసీబీ బ్యాంక్
ఈ బ్యాంకులో ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 3.75 శాతం నుంచి 7.9 శాతం వడ్డీ అందిస్తారు. అలాగే సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ అందిస్తారు. ఈ తాజా రేట్లు 27 సెప్టెంబర్ 2023 నుండి అమలులోకి వచ్చాయి.
ఆర్‌బీఎల్ బ్యాంక్
ఈ బ్యాంకులో సాధారణ కస్టమర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.80 శాతం వరకు వడ్డీని పొందుతారు. అలాగే సీనియర్ సిటిజన్లు టర్మ్ డిపాజిట్లపై 4 శాతం నుంచి 8.30 శాతం మధ్య వడ్డీను అందిస్తుంది. ఈ రేట్లు 16 అక్టోబర్ 2023 నుండి అమలులోకి వస్తాయి.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్
ఈ బ్యాంకులో సాధారణ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.75 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. మరోవైపు సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంక్ 4 శాతం నుంచి 8.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. 549 రోజుల నుంచి రెండు సంవత్సరాల్లో మెచ్యూరయ్యే డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు 7.75 శాతం అందిస్తారు.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
ఈ బ్యాంకులో సాధారణ కస్టమర్లకు 2.8 శాతం నుంచి 7.40 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. 444 రోజులలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు అందిస్తారు. ఈ రేట్లు 1 అక్టోబర్ 2023 నుండి అమలులోకి వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..