AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల జాతర… ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పేది వింటే షాకవుతారు..

సాధారణంగా బ్యాంకు ఎఫ్‌డీ రేట్లతో పోల్చుకుంటే పోస్టాఫీసు వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. పోస్టాఫీసులు డిపాజిట్ల కాలపరిమితి ఆధారంగా 7.5 శాతం వరకు టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఒక సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు ప్రస్తుతం 6.9 శాతం, 2 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 7.0 శాతం, 3 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 7 శాతం, 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 7.5 శాతంగా ఉంది.

FD Interest Rates: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల జాతర… ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పేది వింటే షాకవుతారు..
Money
Nikhil
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 18, 2023 | 7:59 PM

Share

పోస్టాఫీస్‌ డిపాజిట్లతో సహా చాలా చిన్న పొదుపు పథకాలపై ప్రభుత్వం ఇటీవల వడ్డీ రేట్లను పెంచింది. ఆర్‌బిఐ వరుసగా మూడు సార్లు రెపో రేటును యథాతథంగా ఉంచడంతో బ్యాంకులు కూడా కొంతకాలంగా తమ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాయి. సాధారణంగా బ్యాంకు ఎఫ్‌డీ రేట్లతో పోల్చుకుంటే పోస్టాఫీసు వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. పోస్టాఫీసులు డిపాజిట్ల కాలపరిమితి ఆధారంగా 7.5 శాతం వరకు టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఒక సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు ప్రస్తుతం 6.9 శాతం, 2 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 7.0 శాతం, 3 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 7 శాతం, 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 7.5 శాతంగా ఉంది. కాబట్టి బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు ఏంటో? తెలుసుకోవడంతో ఈ వడ్డీ రేట్ల పెంపు గురించి ఆర్‌బీఐ గవర్నర్‌ ఏం చెబుతున్నారో? ఓసారి తెలుసుకుందాం.

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్ కాలపరిమితిచ డిపాజిటర్ వయస్సు ఆధారంగా ఎఫ్‌డీలపై 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 
  • ఎస్‌బీఐ ఏటా 7.50 శాతం వరకు ఎఫ్‌ రేట్లను అందిస్తోంది
  • పీఎన్‌బీ సంవత్సరానికి 7.75 శాతం వరకు వడ్డీ రేటును ఖాతాదారులకు అందిస్తుంది. 
  • ఐసీఐసీఐ బ్యాంక్ వార్షికంగా 7.60 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది.

ఈ వడ్డీ రేట్ల గురించి గవర్నర్ శక్తికాంత దాస్ తన ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనలో ఇటీవల వడ్డీ రేట్లు పెరగవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత రేటు పెంపు చక్రంలో పూర్తి ద్రవ్య విధాన ప్రసారం ఇంకా జరగలేదని, తద్వారా వడ్డీ రేట్లను పెంచడానికి రుణదాతలను ఒత్తిడి చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల ప్రారంభంలో ద్వైమాసిక ద్రవ్య విధానం తర్వాత ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ రెపో రేటు పెంపుదల ప్రసారం ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. మేము రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచాము (ప్రస్తుత రేటు పెంపు చక్రంలో) కానీ అది పూర్తిగా డిపాజిట్ రేట్లు లేదా బ్యాంకుల రుణ రేట్లలోకి అనువదించలేదని వివరించారు.

వడ్డీ రేట్లు పెంపు అనేది కచ్చితంగా రెపో రేటుకు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. మే 2022లో జరిగిన ఆఫ్-సైకిల్ సమావేశంలో ఎంపీసీ పాలసీ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దాని తర్వాత ఫిబ్రవరి 2023 వరకు జరిగిన ఐదు తదుపరి సమావేశాల్లో ప్రతిదానిలో వివిధ పరిమాణాల నేపపథ్యంలో రేటు పెంచారు. మే 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్య సంచితంగా బేసిస్ పాయింట్ల ఆధారంగా రెపో రేటు 250 పెంచారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..