Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Scooters: మరో నయా స్కూటర్‌ను లాంచ్ చేసిన ఏథర్.. టాప్ రేపుతున్న ఫీచర్స్ ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్ల హవా బాగా నడుస్తుంది. ముఖ్యంగా భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఈవీ స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు సరికొత్త ఫీచర్లతో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ కంపెనీ ఏథర్ తాజాగా రిజ్టా నయా వెర్షన్‌ను లాంచ్ చేసింది.

EV Scooters: మరో నయా స్కూటర్‌ను లాంచ్ చేసిన ఏథర్.. టాప్ రేపుతున్న ఫీచర్స్ ఇవే..!
Ather Rizta S
Srinu
|

Updated on: Jul 03, 2025 | 1:50 PM

Share

ఏథర్ కంపెనీ తన రిజ్జా ఎస్ ఈవీ స్కూటర్‌కు 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ను జోడించిన రిజ్జా లైనప్ విస్తరించింది. రూ.1.37 లక్షలు ఎక్స్- షోరూమ్ ధరతో ఈ కొత్త వేరియంట్ రిజ్జా 2.9 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ కంటే ఎక్కువగా ఉంది. 2.9 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ.1.31 లక్షలుగా ఉంది. ఈ కొత్త వేరియంట్లో రిజ్జా జెడ్ 3.7 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌తో గతంలో అందుబాటులో ఉన్న పెద్ద 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 159 కి.మీ మైలేజ్ ఇస్తుందని ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవీత్ ఎస్. ఫోకెలా తెలిపారు. ఇటీవల 1 లక్ష రిజ్టా స్కూటర్ల అమ్మకాలపై ఆనందం వ్యక్తం చేశారు. విభిన్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి తమ పోర్ట్ఫోలియోను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. 

పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ కొత్త వేరియంట్ రిజ్జా అందిచే అన్ని లక్షణాలతో లాంచ్ చేశారు. సువిశాలమైన 34 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ వల్ల రోజువారీ నిత్యావసరాలను సులభంగా వసతి కల్పిస్తుంది.అలాగే ఫ్రంక్ అదనంగా 22 లీటర్ల వరకు విస్తరించవచ్చు. 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌తో రిజ్టా ఐదేళ్ల సమగ్ర వారంటీ ప్రోగ్రామ్ ‘ఏథర్ ఎయిట్ 70’ ఎంపికతో అందుబాటులో ఉంటుంది. కనీసం 70 శాతం బ్యాటరీ హెల్త్‌కు హామీ ఇచ్చేలా సమగ్ర 8 సంవత్సరాల లేదా 80,000 కిమీ (ఏది ముందుగా వస్తే అది) వారెంటీను అందిస్తుంది. కొత్త అథర్ రిజ్జా ఎస్ 3.7 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ టర్న్-బై-టర్న్ వస్తుంది. వివిధ సెక్యూరిటీ అలర్ట్లు, ఫైండ్ మై స్కూటర్, అలెక్సా స్కిల్స్ వంటి ఫీచర్లతో ఈ స్కూటర్ ఆకట్టుకుంటుంది. 

ఏథర్ రిజ్టా ఎస్ 3.7 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌లో నావిగేషన్ కోసం ఏడు అంగుళాల డీప్ వ్యూ డిస్ప్లేతో ఆటో హెల్డ్, ఫాల్ సేఫ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, టో & థెఫ్ట్ ఉన్నాయి. 3.7 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌లో ఓటీఏ  అప్‌డేట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ ఏథర్‌కు సమగ్ర ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్ ఏథర్ గ్రిడ్కు యాక్సెస్‌ను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 3900 ఛార్జింగ్ పాయింట్లను విస్తరించి ఉంది. హెూమ్ ఛార్జింగ్ కోసం వేరియంట్ ఏథర్ సమర్థవంతమైన ఛార్జింగ్ సొల్యూషన్‌తో ఆకట్టుకుంటుంది. రోజువారీ ఉపయోగం కోసం సౌకర్యవంతమైన నైట్ టైమ్ చార్జింగ్‌ను అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..