TATA ACE Pro: ఏస్ ప్రో.. టాటా మోటార్స్ చరిత్రలో నవశకం: గిరీష్ వాఘ్
ఏస్ ప్రో.. టాటా మోటార్స్ చరిత్రలో ఓ కొత్త శకానికి నాందిగా మారుతుంది. బలం, భద్రత, స్వీయ నిర్మిత విజయాలకు ఈ టాటా ఏస్ ప్రో.. కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ అన్నారు. ఇది కేవలం వాహనం మాత్రమే కాదు.. ఎంతోమంది ఆశయాలకు చిహ్నం అని చెప్పారు.
టాటా ఏస్ ప్రారంభించిన రెండు దశాబ్దాల తర్వాత.. మరో కొత్త శకంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాం. బలం, భద్రత.. అలాగే ఎక్కువ లాభదాయకత కోసం రూపొందించిన ఈ టాటా ఏస్ ప్రోను ఆవిష్కరించడం తనకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ అన్నారు. ఈ టాటా ఏస్ ప్రో.. కేవలం కమర్షియల్ వాహనం అని చెప్పడం కాదు.. ఆశ, ఆశయం, స్వావలంబనకు ప్రతీక. ఇది నేటితరం వ్యాపారవేత్తలను ఎంతగానో ఉత్సాహపరిచి.. వారి రేపటి కలలను సాకారం చేసుకునేందుకు స్ఫూర్తినిస్తుంది.
“Ab Meri Baari” కేవలం ప్రచారం మాత్రమే కాదు.. ఇదొక విప్లవం.. నేటితరం వ్యాపారవేత్తలకు స్పూర్తి.. వారిని వారు రూపుదిద్దుకునేందుకు.. స్వంత కథలను చెప్పుకునేందుకు ఓ స్టేజి. ACE ప్రోతో, టాటా మోటార్స్ కేవలం వాహనాన్ని అమ్మడమే కాదు – అలాంటి వ్యాపారవేత్తలను పోరాటం నుంచి విజయం వైపు ప్రయాణించే బలాన్ని చేకూరుస్తుంది. భారతదేశాన్ని పురోగతి వైపు నడిపిస్తుంది.