Income Tax: మీరు ఉద్యోగం చేస్తున్నారా.. అయితే మీ పెట్టుబడుల వివరాలు హెచ్‌ఆర్‌కు అందించారా..
ఉద్యోగాలు చేసేవారు ఆదాయపు పన్ను ఆదా చేయడానికి కేవలం పెట్టుబడి పెడితే సరిపోదు. ఒక సంవత్సర కాలంలో చేసిన అన్ని పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఉద్యోగులు కంపెనీ హెచ్‌ఆర్ పార్ట్‌మెంట్‌కు అందించాలి.
ఉద్యోగాలు చేసేవారు ఆదాయపు పన్ను(Income) ఆదా చేయడానికి కేవలం పెట్టుబడి పెడితే సరిపోదు. ఒక సంవత్సర కాలంలో చేసిన అన్ని పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఉద్యోగులు కంపెనీ హెచ్‌ఆర్(HR) డిపార్ట్‌మెంట్‌కు అందించాలి. సాధారణంగా కంపెనీలు పెట్టుబడి వివరాలను సమర్పించడానికి మార్చి 15 వరకు సమయం ఇస్తుంటాయి. ఎందుకంటే అన్ని మదింపుల తర్వాత వారు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రక్రియను ప్రారంభించాలి. అయితే ఇన్వెస్ట్‌మెంట్లకు(Investors) సంబంధించిన రుజువును అంగీకరించేందుకు చివరి తేదీ వివిధ కంపెనీల్లో వేరువేరుగా ఉంటుంది. మీరు ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ వివరాలను సమర్పించకుంటే.. వెంటనే గడువులోగా పూర్తి చేయటం మంచిది. మీరు దీన్ని పూర్తి చేయలేకపోతే.. మీ ఆదాయపు పన్ను బకాయి మొత్తాన్ని మార్చి నెల జీతం నుంచి డిడక్ట్ చేయబడుతుంది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్- 80C ప్రకారం.. మీరు చేసే ఇన్వెస్ట్ మెంట్, స్పెసిఫిక్ వ్యయంపై గరిష్ఠంగా ఒకటిన్నర లక్షల రూపాయల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. దీని కింద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, PPF, ELSS, NAC, 5 సంవత్సరాల FD, హోమ్ లోన్ ప్రిన్సిపల్ చెల్లింపులు, EPFలో పెట్టుబడులు, ఇద్దరు పిల్లలకు చెల్లించే ట్యూషన్ ఫీజులు ఉంటాయి. ఒకటిన్నర లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందటానికి.. ముందుగా ఈ సంవత్సరం మీరు చేసిన అన్ని పెట్టుబడులకు సంబంధించిన రసీదులను తీసుకోవాలి. దీనిలో పిల్లల ఫీజులు, హోమ్ లోన్ ప్రిన్సిపల్ చెల్లింపులు, PPFలో పెట్టుబడి మొదలైన ఇంతకుముందు తెలిపిన పెట్టుబడులను లెక్కించాలి. దీని తర్వాత సెక్షన్ 80C కింద అవసరమైనంత మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టండి. 80C కింద టాక్స్ పేయర్ గరిష్ఠంగా లక్షన్నర వరకే ప్రయోజనాలు పొందవచ్చని విషయాన్ని ముందుగా గుర్తుంచుకోవాలి.
జీతం పొందే ఉద్యోగులు తాము చెల్లించే ఇంటి అద్దెపై పన్ను తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది రెండు రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ఉద్యోగి నివసిస్తున్న నగరం, మరొకటి మీరు వస్తున్న HRA. ఇంటి అద్దెపై పన్ను తగ్గింపు అనేది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C పరిమితులకు భిన్నంగా ఉంటుంది. ఈ ప్రయోజనాన్ని పొందటానికి ఉద్యోగి ఇంటి అద్దె చెల్లింపు రసీదులను సమర్పించాల్సి ఉంటుంది. సంవత్సరానికి లక్షరూపాయలకంటే ఎక్కువ అద్దె చెల్లించేవారు ఇంటి యజమాని పాన్ కార్డు వివరాలను సైతం అందిచాల్సి ఉంటుంది.
Read Also.. Edible Oil: సామాన్యులకు శుభవార్త..! వంట నూనెల ధరలు తగ్గుతాయా..