Anand Rathi Wealth IPO: డిసెంబరు 2న ఆనంద్‌ రాఠీ వెల్త్‌ ఐపీఓ.. ఒక్కో షేరు ధర రూ.530-550గా నిర్ణయం

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఆనంద్‌ రాఠీ ఆధ్వర్యంలోని ఆనంద్‌ రాఠీ వెల్త్‌ డిసెంబరు 2న ఐపీఓకి రానుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ డిసెంబరు 6న ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ధరల శ్రేణిని రూ.530-550గా నిర్ణయించారు...

Anand Rathi Wealth IPO: డిసెంబరు 2న ఆనంద్‌ రాఠీ వెల్త్‌ ఐపీఓ.. ఒక్కో షేరు ధర రూ.530-550గా నిర్ణయం
Ipo
Follow us

|

Updated on: Nov 30, 2021 | 11:05 PM

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఆనంద్‌ రాఠీ ఆధ్వర్యంలోని ఆనంద్‌ రాఠీ వెల్త్‌ డిసెంబరు 2న ఐపీఓకి రానుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ డిసెంబరు 6న ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ధరల శ్రేణిని రూ.530-550గా నిర్ణయించారు. మొత్తం రూ.660 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పబ్లిక్ ఇష్యూలో ఉన్న మొత్తం 1.2 కోట్ల షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) కింద విక్రయిస్తున్నవే.

వీటిలో 2.5 లక్షల షేర్లు ఉద్యోగులకు రిజర్వు చేయగా.. 15 శాతం షేర్లను సంస్థాగతేతర మదుపర్లు, 35 శాతం రిటైల్‌ మదుపర్లకు, మిగిలిన షేర్లను క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు కేటాయించారు. ఈ ఐపీవోలో పాల్గొనలంటే లాట్‎లో కొనుగోలు చేయాలి. ఒక్క లాట్‎లో 27 షేర్లు ఉంటాయి. కనీసం 14,850 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఆనంద్‌ రాఠీ వెల్త్‌ను 2002లో స్థాపించారు. ఆంఫీ వద్ద నమోదైన ఈ సంస్థ ప్రధానంగా మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను పంపిణీ చేస్తోంది. మార్చి 31, 2019 – ఆగస్టు 31, 2021 మధ్య కంపెనీ నిర్వహణలోని ఆస్తుల మొత్తం (ఏయూఎం) 22.74 శాతం పెరిగింది. సెప్టెంబరు 2018లోనూ సంస్థ రూ.425 కోట్ల సమీకరణ లక్ష్యంతో సెబీ వద్ద ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. కానీ, తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

Read Also.. Maruti Suzuki: మారుతి సుజుకి షాకింగ్ నిర్ణయం.. ఈకో వ్యాన్ ధరలను రూ.8 వేలు పెంచుతున్నట్లు వెల్లడి

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్