Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unemployment: ఇంకా తగ్గని కరోనా ఎఫెక్ట్!.. దేశంలో పెరిగిన నిరుద్యోగం..

దేశంలో నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‎లో ప్రకటన చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజు వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగారు....

Unemployment: ఇంకా తగ్గని కరోనా ఎఫెక్ట్!.. దేశంలో పెరిగిన నిరుద్యోగం..
Unemployeement
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 30, 2021 | 11:23 PM

దేశంలో నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‎లో ప్రకటన చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజు వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగారు. హర్యానాలోని భివానీ-మహేంద్రగఢ్ ఎంపీ ధరమ్‌వీర్ సింగ్ నిరుద్యోగం, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలకు సంబంధించి రాష్ట్రాల వారీ గణాంకాలను అడిగారు. ఎంపీ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

ఈ ఏడాది 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ‘నిరుద్యోగ రేటు’ 9.3 శాతానికి పెరిగింది. గత ఏడాది 2020లో ఇదే త్రైమాసికంలో ‘నిరుద్యోగ రేటు’ 9.1 శాతమే. ఇవన్నీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన తాజా ‘నియమిత కాలిక శ్రామిక శక్తి సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) చెప్పిన లెక్కలే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2019-20 సంవత్సరంలో నాగాలాండ్‌లో అత్యధికంగా 25.7 శాతం నిరుద్యోగం ఉంది, అదే సమయంలో లడఖ్‌లో అత్యల్ప నిరుద్యోగ రేటు 0.1 శాతం ఉంది.

ఎన్‌ఎస్‌ఓ 2017లో పీఎల్‌ఎఫ్‌ఎస్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి త్రైమాసికానికీ మన దేశంలో ఇలా ‘శ్రామిక శక్తి సర్వే’ జరుగుతోంది. దేశంలోని నిరుద్యోగ స్థితిగతులను ఈ సర్వే రికార్డు చేస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెంటిలోనూ రకరకాల నిరుద్యోగాలు, వివిధ ఉద్యోగాలలో వస్తున్న వేతనాలు, పని గంటలకు సంబంధించిన సమాచారాన్ని ఈ సర్వేలో సేకరిస్తారు. స్త్రీ పురుషుల్లో ఎవరెంత నిరుద్యోగులో, మొత్తం మీద ‘నిరుద్యోగ రేటు(యూఆర్‌)’ ఎంతో లెక్కిస్తారు. సూక్ష్మ స్థాయిలో అయితే దేశంలో నిరుద్యోగ నిష్పత్తిని ఈ ‘యూఆర్‌’ సూచిస్తుంది.

“ఉపాధి కల్పన అనేది ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. దేశంలో ఉపాధి కల్పనను పెంచేందుకు భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది . ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ABRY) ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0లో భాగంగా సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి యజమానులను ప్రోత్సహించడానికి, COVID-19 మహమ్మారి సమయంలో ఉపాధి నష్టాలను భర్తీ చేయడానికి అక్టోబర్ 1, 2020 నుండి ప్రారంభించాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా అమలు చేసిన ఈ పథకం యజమానులపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిచాం, ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకునేలా ప్రోత్సహించాం” అని మంత్రి చెప్పారు.

Read Also.. Maruti Suzuki: మారుతి సుజుకి షాకింగ్ నిర్ణయం.. ఈకో వ్యాన్ ధరలను రూ.8 వేలు పెంచుతున్నట్లు వెల్లడి