Maruti Suzuki: మారుతి సుజుకి షాకింగ్ నిర్ణయం.. ఈకో వ్యాన్ ధరలను రూ.8 వేలు పెంచుతున్నట్లు వెల్లడి
మారుతి సుజుకి ఈకో వ్యాన్ ధరలను రూ. 8,000 పెంచింది. ధరలను పెంచుతూ మారుతి సుజుకి ఇండియా మంగళవారం తెలియజేసింది. ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఎకో వ్యాన్ అన్ని నాన్-కార్గో వేరియంట్‌ల ధరలను రూ. 8,000 పెంచారు.....
మారుతి సుజుకి ఈకో వ్యాన్ ధరలను రూ. 8,000 పెంచింది. ధరలను పెంచుతూ మారుతి సుజుకి ఇండియా మంగళవారం తెలియజేసింది. ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఎకో వ్యాన్ అన్ని నాన్-కార్గో వేరియంట్‌ల ధరలను రూ. 8,000 పెంచారు. ఎకో వ్యాన్ ధరలలో ఈ పెరుగుదల నవంబర్ 30, 2021 నుండి అంటే మంగళవారం నుంచి అమలులోకి వస్తుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎకో వ్యాన్ ప్యాసింజర్ వెర్షన్ ధర రూ. 4.3 లక్షలతో మొదలై రూ. 5.6 లక్షలకు చేరుకోగా, అంబులెన్స్ వెర్షన్ ధర రూ. 7.29 లక్షలుగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో, కంపెనీ సెలెరియో మినహా మొత్తం ఉత్పత్తి శ్రేణి ధరలను 1.9 శాతం వరకు ధరలు పెంచింది. ఈ ఏడాది ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచడం ఇది మూడోసారి. ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని కార్లకు ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1, 2021 నుండి అన్ని కొత్త కార్లు కూడా ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది.
డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, సీట్‌బెల్ట్ రిమైండర్‌లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్‌ను కార్లలో తప్పనిసరి చేశారు. మారుతి సుజుకి ఈకోలో నాలుగు ప్యాసింజర్, ఒక అంబులెన్స్ వెర్షన్‌తో పాటు మూడు కార్గో వేరియంట్‌లు ఉన్నాయి. సాధారణ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కార్లకు ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసింది. ఆ సమయంలో డ్రైవర్‌తో కూర్చున్న ప్రయాణికుల భద్రత కోసం ఈ నియమం అవసరమని మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన సూచనలను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సూచించిన AIS 145 ప్రమాణం ప్రకారం ఎయిర్‌బ్యాగ్‌లను తయారు చేయాలి.