Amazon prime phone party sale: ఈ స్మార్ట్ ఫోన్లపై అమెజాన్లో అదిరే ఆఫర్లు.. 40 శాతం వరకు డిస్కౌంట్.. అస్సలు మిస్ చేసుకోవద్దు..

Madhu

Madhu |

Updated on: Feb 06, 2023 | 2:10 PM

ప్రైమ్ ఫోన్ పార్టీ సేల్ ఫిబ్రవరి 8 వరకు లైవ్‌లో ఉంటుంది. శామ్సంగ్, జియోమీ, ఐక్యూఓఓ, రియల్ మీ, టెక్నో, ఒప్పో వంటి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లనుంచి పలు స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకూ తగ్గింపు పొందవచ్చు.

Amazon prime phone party sale: ఈ స్మార్ట్ ఫోన్లపై అమెజాన్లో అదిరే ఆఫర్లు.. 40 శాతం వరకు డిస్కౌంట్.. అస్సలు మిస్ చేసుకోవద్దు..
Amazon Offers

మీరు ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అది కూడా మినిమ్ బడ్జెట్ అయితే చాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. మీరు అస్సలు ఈ వార్తను స్కిప్ చేయొద్దు.. ప్రముఖ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లపై మరో సరికొత్త సేల్‌ ప్రారంభించింది. ప్రత్యేకించి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌ల సూపర్ డిస్కౌంట్ల తో ప్రైమ్ ఫోన్ పార్టీ సేల్ ప్రకటించింది. ప్రైమ్ ఫోన్ పార్టీ సేల్ ఫిబ్రవరి 8 వరకు లైవ్‌లో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లపై అనేక డీల్‌లు, ఆఫర్‌లను అందిస్తోంది. శామ్సంగ్, జియోమీ, ఐక్యూఓఓ, రియల్ మీ, టెక్నో, ఒప్పో వంటి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లనుంచి పలు స్మార్ట్ ఫోన్లపై కొనుగోలుదారులు 40 శాతం వరకూ తగ్గింపు పొందవచ్చు. ఆ ఆఫర్లేంటో.. అందులో మీకు ఏది బెస్టో తెలియాలి అంటే.. అమెజాన్ ఆఫర్లపై మీరూ ఓ లుక్కేయండి..

జియోమీ(Xiaomi) ఆఫర్లు ఇవే..  అమోజాన్ ప్రైమ్ ఫోన్ పార్టీ సేల్ లో జియోమీ బ్రాండ్ కు చెందిన పలు ఫోన్లు ఆఫర్లపై లభిస్తున్నాయి. వాటిలో Mi 12 ప్రో ఫోన్‌ ఉంది. దీనిని రూ. 47,499 ధరకు విక్రయిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCని కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ తో ఇది స్తుంది. అలాగే రెడ్ మీ 10 పవర్, రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ, రెడ్ మీ కే50ఐ తదితర హ్యాండ్‌సెట్‌లను కూడా తగ్గింపు ధరలకు అందిస్తోంది.

శామ్సంగ్(samsung) ఫోన్ల పై ఈ ఆఫర్లు మళ్లీ మళ్లీ రావు.. కొరియన్ దిగ్గజం శామ్సంగ్ తక్కువ ధరకే ఎం సిరీస్ హ్యాండ్‌సెట్‌లను సేల్‌లో అందిస్తోంది. కస్టమర్‌లు గేలాక్సీ ఎం33, గేలాక్సీ ఎం13, గేలాక్సీ ఎం04లను వరుసగా రూ. 15,342, రూ. 9,927 , రూ. 8,499 ధరలలో కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఐక్యూఓఓ(iQoo)పై ఆఫర్లు ఇవి.. కస్టమర్లు ఐక్యూఓఓ జెడ్6 లైట్ ని రూ. 13,988 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐక్యూఓఓ నియో 6 రూ. 25,649కే లభిస్తుంది. ఇది కాకుండా, కస్టమర్లు సరికొత్త ఐక్యూఓఓ 11 5జీ ఫోన్‌ను రూ. 54,999కే కొనుగోలు చేయవచ్చు.

రియల్ మీ(Realme) ఫోన్లు ఇవి.. వినియోగదారులు రియల్ మీ నార్జో 50 ప్రోని 18,049 రూపాయల తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు, నార్జో 50ఐ ప్రైమ్ ని రూ. 7,199కి అందుబాటులో ఉంది

ఒప్పో(Oppo) ఫోన్లపై బెస్ట్ ఆఫర్లు.. అమెజాన్ ప్రైమ్ ఫోన్స్ పార్టీ సేల్ సందర్భంగా, ఒప్పో తన ఏ78, ఒప్పో ఎఫ్ 21ఎస్ ప్రో, ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 5జీ, ఇతర స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలకు అందిస్తోంది.

టెక్నో(Tecno) స్మార్ట్‌ఫోన్లపై.. టెక్నో తన స్పార్క్ 9ని రూ. 7,799 నుంచి ప్రారంభిస్తోంది. ఇది హీలియో జీ 37 గేమింగ్ ప్రాసెసర్, 7జీబీ ఎక్స్‌పాండబుల్ ర్యామ్‌తో వస్తోంది. అలాగే టెక్నో పాప్ 6 ప్రో రూ. 15,999 వద్ద అందుబాటులో ఉంది. డిస్కౌంట్లు, ఆఫర్‌లను కలిగి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu