Amazon Sale: హాట్‌ సమ్మర్‌‌లో కూల్‌ ఆఫర్లు.. ఏసీల కొనుగోలుపై 50శాతం వరకూ తగ్గింపు.. అస్సలు మిస్‌ అవ్వొద్దు..

ఒకవేళ మీరు కూడా మంచి స్ల్పిట్‌ ఏసీ కొనుగోలు చేయాలని చూస్తుంటే ఈ కథనం మీకోసమే. అమెజాన్‌లో ఏసీలపై అదిరి ఆఫర్లు ఉన్నాయి. ఆయా కంపెనీలను బట్టి ఏకంగా 50శాతం వరకూ డిస్కౌంట్లు ఉన్నాయి. వాటిల్లో అత్యుత్తమ జాబితా మీకోసం రెడీ చేసి అందిస్తున్నాం.

Amazon Sale: హాట్‌ సమ్మర్‌‌లో కూల్‌ ఆఫర్లు.. ఏసీల కొనుగోలుపై 50శాతం వరకూ తగ్గింపు.. అస్సలు మిస్‌ అవ్వొద్దు..
Representative Image
Follow us
Madhu

|

Updated on: May 20, 2023 | 4:15 PM

వేసవి ఉడికిస్తోంది. గాడ్పులు కంగారెత్తిస్తున్నాయి. విపరీతమైన ఉక్కపోత చిరాకు తెప్పిస్తోంది. ఇటువంటి సమయంలో అందరూ చల్లదనాన్ని కోరుకొంటుంటారు. ఫలితంగా అందరూ ఎయిర్‌ కండీషనర్ల వైపు చూస్తున్నారు. ప్రతి ఇంట్లో ఏసీ ఉండాలని కోరుకొంటున్నారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా ఏసీలకు డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా స్ల్పిట్‌ ఏసీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఒకవేళ మీరు కూడా మంచి స్ల్పిట్‌ ఏసీ కొనుగోలు చేయాలని చూస్తుంటే ఈ కథనం మీకోసమే. అమెజాన్‌లో ఏసీలపై అదిరి ఆఫర్లు ఉన్నాయి. ఆయా కంపెనీలను బట్టి ఏకంగా 50శాతం వరకూ డిస్కౌంట్లు ఉన్నాయి. వాటిల్లో అత్యుత్తమ జాబితా మీకోసం రెడీ చేసి అందిస్తున్నాం. ఏసీ కొనుగోలు చేయానుకొనే వారు ఇది మిస్ అవ్వొద్దు..

క్యారియర్ 1.5 టన్‌ 3 స్టార్ ఏఐ ఫ్లెక్సీ కూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. ఈ ఏసీ కొనుగోలుపై అమెజాన్‌ 50శాతం తగ్గింపును అందిస్తోంది. దీనిలో ఇన్‌స్టా కూల్ మోడ్‌ ఉంటుంది. ఈ ఏసీలో 17 డిగ్రీల రూమ్‌ టెంపరేచర్‌ ను కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే అందుకుంటుంది. దీని నుంచి వచ్చే గాలిని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి, దీనిలో పీఎం 2.5/హెచ్‌డీ ఫిల్టర్‌ను అమర్చారు, ఇది దుమ్ము, ఇతర మైక్రోపార్టికల్ కాలుష్యాన్ని అరికడుతుంది. భారతదేశంలోని అత్యుత్తమ స్ప్లిట్ ఏసీలలో ఒకటైన ఈ ఏసీపై 50శాతం తగ్గింపుతో మీరు దీనిని రూ. 33,999కే కొనుగోలు చేయవచ్చు.

ప్యానసోనిక్ 1.5 టన్‌ 3 స్టార్ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ.. పాతకాలం నుంచి అత్యత్తమ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ప్యానసోనిక్‌ కంపెనీ నుంచి వస్తున్న ఈ ఏసీ మంచి పనితీరుని కనబరుస్తుంది. ఇది అంతర్నిర్మిత సెన్సార్లు, కృత్రిమ మేథస్సు ద్వారా అదనపు ఏఐ మోడ్‌తో 7 ఇన్ 1 కన్వర్టిబుల్ మోడ్‌తో వస్తుంది. ఫ్యాన్‌ వేగాన్ని 40శాతం నుంచి 90శాతం వరకూ అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. దీనిపై అమెజాన్‌ లో 34శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో కేవలం రూ. 36,490లకే ఇది లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

లాయిడ్‌ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. ఈ ఏసీ కొనుగోలుపై అమెజాన్‌ 44శాతం తగ్గింపును అందిస్తోంది. ఇది మన దేశంలోని అత్యుత్తమ స్ప్లిట్ ఏసీలలో ఒకటి. ఈ ఎయిర్ కండీషనర్ వేరియబుల్-స్పీడ్ కంప్రెసర్‌ను కలిగి ఉంది. ఇది ఆటోమేటిక్‌గా కూలింగ్‌ అడ్జస్ట్‌ చేస్తుంది. ఇంట్లో టెంపరేచర్‌ ను బట్టి అడ్జస్ట్‌ అయిపోతుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా 5 కూలింగ్ మోడ్‌లలో దీనిని వాడుకోవచ్చు. దీని ధర రూ. 32,999గా ఉంది.

ఎల్‌జీ 1 టన్ 4 స్టార్ ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. ఈ ఏసీపై కూడా అమెజాన్‌ 44శాతం తగ్గిపును అందిస్తోంది. ఇది చిన్న సైజ్‌ గదులకు ఉత్తమ ఎంపిక. ఏఐ కన్వర్టిబుల్ 6-ఇన్-1 వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ ఉంటుంది. దీని ధర రూ. 34,990గా ఉంది.

వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్, ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. అమెజాన్‌ సేల్ ఈ ఓల్టాస్‌ ఏసీపై 50% తగ్గింపును అందిస్తుంది. ఇది మీడియం సైజు గదులకు అనువైనది. దీనిలో కూడా వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌ ఉంటుంది.రిమోట్ కంట్రోల్ ద్వారా నాలుగు నాలుగు మోడ్‌లను అడ్జస్ట్‌ చేయవచ్చు.దీని ధర ఆఫర్‌ పోను రూ. 32,240గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..