Amazon Flipkart: మొదలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ సందడి.. చిన్న నగరాల నుంచే ఎక్కువ డిమాండ్
Amazon Flipkart: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ పండుగ సేల్స్‌ని ప్రారంభించాయి. అయితే అనూహ్యంగా ఈ కంపెనీలకు టైర్ -2, టైర్ -3 నగరాల నుంచి

Amazon Flipkart: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ పండుగ సేల్స్‌ని ప్రారంభించాయి. అయితే అనూహ్యంగా ఈ కంపెనీలకు టైర్ -2, టైర్ -3 నగరాల నుంచి సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మంచి రెస్పాన్స్‌తో పాటు డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు కంపెనీలు తెలిపాయి. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ తన ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’ ప్రోగ్రామ్ ద్వారా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 40 శాతం వృద్ధిని నమోదు చేసిందని ప్రకటించింది. అయితే ఇందులో కస్టమర్ల డిమాండ్ టైర్ -3 నగరాల నుంచి 45 శాతంగా ఉందని పేర్కొంది.
అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ ఒక ప్రత్యేక ప్రకటనలో మాట్లాడుతూ.. Amazon.in లో అత్యధిక సింగిల్ డే అమ్మకాల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 60 శాతం పెరిగిందని తెలిపారు. ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021’ ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చిందన్నారు. అమెజాన్‌లో ప్రతిరోజు లక్షలాది మంది షాపింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో దుకాణదారులు, చేతివృత్తులవారు, నేత కార్మికులు కూడా ఉన్నారని తెలిపారు. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ భారతదేశవ్యాప్తంగా కస్టమర్లకు అందుబాటులో ఉంది. ప్రతి ముగ్గురు కొత్త ప్రైమ్ కస్టమర్లు టైర్ -2, టైర్ -3 నగరాల నుంచే ఉన్నారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ 8 రోజుల పాటు కొనసాగుతుంది ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ విక్రయాలు ఎనిమిది రోజుల ఈవెంట్. ఇది అక్టోబర్ 10న ముగుస్తుంది. అమెజాన్ ఇండియా GIF ఒక నెల పాటు ఉంటుంది. ఇది కాకుండా మింత్ర, స్నాప్‌డీల్, ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా అమ్మకాలను నిర్వహిస్తున్నాయి.