పండుగ వేళ అమెజాన్‌ సరికొత్త ఆఫర్లు

పండుగల వేళ మరిన్ని సంబురాలను మోసుకు వచ్చింది. ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ. అప్పుడే పండుగ సందడి మొదలుపెట్టాయి.

పండుగ వేళ అమెజాన్‌ సరికొత్త ఆఫర్లు
Balaraju Goud

|

Oct 06, 2020 | 6:08 PM

పండుగల వేళ మరిన్ని సంబురాలను మోసుకు వచ్చింది. ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ. అప్పుడే పండుగ సందడి మొదలుపెట్టాయి. కరోనా నేపథ్యంలో వినియోగదారులు ఆఫ్ లైన్ షాపింగ్ కంటే.. ఆన్ లైన్ షాపింగ్ కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో తమ కస్టమర్లకు ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి ఈ కామర్స్ సంస్థలు. దసరా, దీపావళి పండగ సీజన్‌ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ “గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌”ను ప్రకటించింది. అక్టోబరు 17వ తేదీన ఈ ప్రత్యేక సేల్‌ ప్రారంభం కానుంది. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో భాగంగా అమెజాన్‌లో వస్తువులు కొనుగోలు చేసేవారు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డును ఉపయోగించి 10శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చని ప్రకటించింది.

ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగిన వారు 24గంటల ముందు నుంచే గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో వస్తువులు కొనుగోలు చేసుకునే వీలు కల్పించింది. అలాగే వస్తువుల కొనుగోళ్లపై ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. మొబైల్‌ ఫోన్లు, గృహోపకరణాలు, నిత్యావసర సరకులు, దుస్తులు, పుస్తకాలు, పిల్లల బొమ్మలపై కూడా రాయితీలు లభించనున్నాయి. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుపై వడ్డీ లేకుండా వాయిదాల్లో వస్తువులను కొనుగోలు చేయవచ్చు.అంతేకాకుండా అమెజాన్‌ యాప్‌లో రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ సాగే గోల్డెన్‌ అవర్స్‌లో మరికొన్ని వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది ఆమెజాన్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu