AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి పైపైకి పసిడి ధరలు…

పసిడి ధరలు మరోసారి సామాన్యుడితో దోబులాడుతోంది. దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు త‌గ్గిన‌ట్టే త‌గ్గిన మ‌ళ్లీ కొండెక్కుతున్నాయి.

మరోసారి పైపైకి పసిడి ధరలు...
Balaraju Goud
|

Updated on: Oct 06, 2020 | 5:50 PM

Share

పసిడి ధరలు మరోసారి సామాన్యుడితో దోబులాడుతోంది. దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు త‌గ్గిన‌ట్టే త‌గ్గిన మ‌ళ్లీ కొండెక్కుతున్నాయి. ఆగ‌స్టులో అత్య‌ధికంగా రూ.56 వేల మార్కును దాటిన బంగారం ధ‌ర క్ర‌మంగా త‌గ్గుతూ ఒక ద‌శ‌లో రూ.50 వేల‌కు దిగి చేరుకుంది. కాగా, గత వారం హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటూ ఊగిస‌లాటల నడుమ కొద్దికొద్దిగా పెరుగుతుంది. దీంతో మరోసారి స్వచ్ఛమైన పసిడి ధర రూ.52 వేలకు చేరువైంది. తాజాగా మంగ‌ళ‌వారం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.454 పెరిగి రూ.51,879 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇది హైదరాబాద్, విజయవాడ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,680 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాల‌ర్‌తో పోల్చుకుంటే రూపాయి మార‌కం విలువ కొంత బ‌ల‌హీనప‌డ‌టం కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణ‌మైందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు చెబుతున్నారు. కాగా, గ‌త ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.51,425 వ‌ద్ద ముగిసింది. ఇక వెండి ధ‌ర‌లు కూడా మంగ‌ళ‌వారం స్వ‌ల్పంగా పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.751 పెరిగి రూ.63,127కు చేరింది. గ‌త ట్రేడ్‌లో కిలో వెండి రూ.62,376 వ‌ద్ద ముగిసింది. అటు అంతర్జాతీయ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1960 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, వెండి 24.41 డాలర్లు పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ తో పోలిస్తే రూపాయి మారక విలువ రూ.73.47గా ఉంది.

Follow Us
మార్కులు బాగా తెచ్చుకొండి.. విమానం ఎక్కిస్తా..
మార్కులు బాగా తెచ్చుకొండి.. విమానం ఎక్కిస్తా..
మీరూ పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా?
మీరూ పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా?
భార్యాభర్తల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందా? ఇదుగో టెక్నిక్
భార్యాభర్తల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందా? ఇదుగో టెక్నిక్
స్కూల్‌ టీచర్స్‌ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ క్లిక్ చేయగానే.
స్కూల్‌ టీచర్స్‌ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ క్లిక్ చేయగానే.
తల్లి త్యాగానికి కరిగిన మంత్రి! టీవి9 వెబ్ కథనానికి స్పందన..
తల్లి త్యాగానికి కరిగిన మంత్రి! టీవి9 వెబ్ కథనానికి స్పందన..
సెట్‏లో చిరంజీవి గంటన్నర కూడా ఉండలేకపోయారు..
సెట్‏లో చిరంజీవి గంటన్నర కూడా ఉండలేకపోయారు..
బైక్‌లో డీజిల్‌ ఎందుకు వాడరో తెలుసా? 90శాతం మందికి అస్సలు తెలియదు
బైక్‌లో డీజిల్‌ ఎందుకు వాడరో తెలుసా? 90శాతం మందికి అస్సలు తెలియదు
ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్..
ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్..
సినిమాను మించి.. ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ యువడిని కాపాడిన ఏఎస్‌ఐ..
సినిమాను మించి.. ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ యువడిని కాపాడిన ఏఎస్‌ఐ..
బాలాజీ టెంపుల్‌ను వివాదాంలోకి లాగిన అమెరికన్ సెనేటర్
బాలాజీ టెంపుల్‌ను వివాదాంలోకి లాగిన అమెరికన్ సెనేటర్