AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. శుక్రవారం ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. బస్సులు కూడా అనుమతించరు

Muharram Procession 2026: మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే బీబీ కా ఆలమ్ ఊరేగింపును దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. జూన్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి. చార్మినార్, మదీనా, నయాపూల్, సాలార్ జంగ్ రోటరీ తదితర ప్రాంతాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని పోలీసులు సూచించారు.

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. శుక్రవారం ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. బస్సులు కూడా అనుమతించరు
Hyderabad Traffic Alert
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 25, 2026 | 6:05 PM

Share

అంతటా మొహర్రం సందడి నెలకొంది.. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. మొహర్రం మొదటి నెలను పవిత్రమైన మాసంగా భావిస్తారు. ముఖ్యంగా ‘ఆషూరా’ మొహర్రం 10వ రోజు నాడు కర్బలా యుద్ధంలో అమరులైన ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యుల త్యాగాలను స్మరిస్తూ ముస్లింలు ఈ మాసంలో సంతాపం, ప్రత్యేక ప్రార్థనలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పదో రోజు శుక్రవారం హైదరాబాద్‌లోని ‘బీబీ కా అలవా’ నుండి నిర్వహించబడే ‘బీబీ కా ఆలమ్’ (BIBI-KA-ALAM) ఊరేగింపు సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 26-06-2026 (శుక్రవారం) మధ్యాహ్నం 12:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు క్రింది విధంగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు (Diversions) విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం ప్రకటనలో తెలుసింది.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు ఇలా:

  1. బీబీ కా అలవా మార్గం: బీబీ కా అలవా వైపునకు వాహనాల రాకపోకలు అనుమతించబడవు. ఈ ట్రాఫిక్‌ను సునార్‌గల్లీ ‘టి’ జంక్షన్ వద్ద దబీర్‌పురా దర్వాజా, గంగా నగర్ నాలా, యాకుత్‌పురా వైపునకు మళ్లిస్తారు.
  2. షేక్ ఫైజ్ కమాన్ మార్గం: షేక్ ఫైజ్ కమాన్ వైపునకు వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను జబ్బార్ హోటల్ వద్ద అవసరాన్ని బట్టి దబీర్‌పురా దర్వాజా లేదా చంచల్‌గూడ వైపునకు మళ్లిస్తారు.
  3. ఏతేబార్ చౌక్ మార్గం: ఏతేబార్ చౌక్ నుండి బడా బజార్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను ఏతేబార్ చౌక్ వద్ద పరిస్థితిని బట్టి కోట్లా అలీజా లేదా పురాణీ హవేలీ వైపునకు మళ్లిస్తారు.
  4. గంగా నగర్ నాలా (యాకుత్‌పురా): ప్రధాన ఊరేగింపు గంగా నగర్ నాలాకు చేరుకున్నప్పుడు, పురాణీ హవేలీ నుండి ఏతేబార్ చౌక్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను పురాణీ హవేలీ వద్ద చత్తా బజార్, దబీర్‌పురా లేదా ఎస్‌జే రోటరీ (Salarjung Rotary) వైపునకు మళ్లిస్తారు.
  5. బీబీ బజార్ చౌరస్తా: ఊరేగింపు గంగా నగర్ నాలాకు చేరుకున్నప్పుడు, మొఘల్‌పురా, వోల్టా హోటల్ నుండి ఏతేబార్ చౌక్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను బీబీ బజార్ చౌరస్తా వద్ద పారిస్ కేఫ్ లేదా తలాబ్ కట్ట వైపునకు మళ్లిస్తారు.
  6. గుల్జార్ హౌజ్: ఊరేగింపు ఏతేబార్ చౌక్‌కు చేరుకున్నప్పుడు, మిట్టీ కా షేర్, మదీనా నుండి ఏతేబార్ చౌక్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను గుల్జార్ హౌజ్ వద్ద మదీనా లేదా మిట్టీ కా షేర్ వైపునకు మళ్లిస్తారు.
  7. హాఫెజ్ డంకా మసీదు: ఊరేగింపు కోట్లా అలీజాకు చేరుకున్నప్పుడు, మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ నుండి చౌక్ మైదాన్ ఖాన్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను హాఫెజ్ డంకా మసీదు వద్ద పారిస్ కేఫ్ లేదా బీబీ బజార్ వైపునకు మళ్లిస్తారు.
  8. చార్మినార్ ప్రాంతం: ఊరేగింపు చార్మినార్‌కు చేరుకున్నప్పుడు, శక్కర్‌కోట్ నుండి గుల్జార్ హౌజ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. దీనిని మిట్టీ కా షేర్ జంక్షన్ వద్ద ఘన్సీ బజార్ లేదా చేలాపురా వైపునకు మళ్లిస్తారు. అదే సమయంలో ఏతేబార్ చౌక్ వద్ద ఉన్న ట్రాఫిక్‌ను కోట్లా ఆలిజా లేదా పురాణీ హవేలీ వైపునకు మళ్లిస్తారు.
  9. మదీనా చౌరస్తా: ఊరేగింపు చార్మినార్‌కు చేరుకున్నప్పుడు, నయాపూల్ నుండి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను మదీనా చౌరస్తా వద్ద సిటీ కాలేజ్ వైపునకు మళ్లిస్తారు.
  10. సాలార్ జంగ్ రోటరీ: ఊరేగింపు మీరాలం మండికి చేరుకున్నప్పుడు.. చాదర్‌ఘాట్ రోటరీ, నూర్ ఖాన్ బజార్, సాలార్ జంగ్ మ్యూజియం – శివాజీ బ్రిడ్జ్ నుండి పురాణీ హవేలీ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను సాలార్ జంగ్ రోటరీ వద్ద నయాపూల్, శివాజీ బ్రిడ్జ్, నూర్ ఖాన్ బజార్ వైపునకు మళ్లిస్తారు.
  11. చాదర్‌ఘాట్ రోటరీ: ఊరేగింపు అలవా సర్తౌక్‌కు చేరుకున్నప్పుడు, చాదర్‌ఘాట్ రోటరీ నుండి కాళీ ఖబర్ వైపు వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను చాదర్‌ఘాట్ రోటరీ వద్ద చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ మీదుగా రంగమహల్ లేదా కోటి వైపునకు మళ్లిస్తారు.
  12. సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ ప్రవేశ మార్గం: గౌలిగూడ లేదా అఫ్జల్‌గంజ్ నుండి సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. గౌలిగూడ వైపు ఉన్న సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ ప్రవేశ ద్వారం వద్దనే ఈ ట్రాఫిక్‌ను తిరిగి అఫ్జల్‌గంజ్, గౌలిగూడ వైపునకు మళ్లిస్తారు.
  13. నయాపూల్: ఊరేగింపు అలవా సర్తౌక్‌కు చేరుకున్నప్పుడు, ఎస్‌జే (Salarjung) రోటరీ వైపు వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను నయాపూల్ వద్ద మదీనా వైపునకు మళ్లిస్తారు.
  14. ఆర్టీసీ (APSRTC / TGSRTC) బస్సుల మళ్లింపు: ఏపీఎస్‌ఆర్టీసీ, టీజీఎస్‌ఆర్టీసీ జిల్లా బస్సుల రాకపోకలను 26-06-2026 తేదీ ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 09:00 గంటల వరకు రంగమహల్, అఫ్జల్‌గంజ్ వైపునకు మళ్లిస్తారు. ఊరేగింపు ముగింపు స్థానానికి చేరుకునే వరకు ఈ బస్సులను కాళీ ఖబర్ – మీరాలం మండి రోడ్డుపైకి అనుమతించరు.

నగర పౌరులు, వాహనదారులు.. పై పేర్కొన్న ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us