AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడు నెలల గరిష్టాన్ని తాకిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టి మార్కెట్లు ఏడు నెలల గరిష్టానికి తాకాయి. కరోనా ప్రభావంతో చతికిలాపడ్డా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి.

ఏడు నెలల గరిష్టాన్ని తాకిన స్టాక్ మార్కెట్లు
Balaraju Goud
|

Updated on: Oct 06, 2020 | 8:49 PM

Share

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టి మార్కెట్లు ఏడు నెలల గరిష్టానికి తాకాయి. కరోనా ప్రభావంతో చతికిలాపడ్డా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఎనర్జీ మినహా మిగతా రంగాలు భారీ లాభాలను అర్జించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 పాయింట్ల మేర నమోదు చేశాయి.సెన్సెక్స్ 600.87 పాయింట్లు లాభపడి 39,574.57 వద్ద ట్రేడ్ అయ్యింది. దాదాపు ఒక్కరోజులోనే 1.54% లాభాన్ని నమోదు చేసుకుంది. నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 11,662.40 వద్ద 1.38% శాతం లాభంతో ముగిసాయి. ఇక… 1,488 షేర్లు లాభాల్లో, 1,165 షేర్లు నష్టాల్లో ముగియగా, 159 షేర్లలో ఎలాంటి మార్పూలేదు. ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్ ధర నాలుగు శాతానికి పైగా లాభపడింది. నిన్నటి వరకు ఎగసిపడిన ఐటీ స్టాక్స్ ఈ రోజు కాస్త వెనుకబడ్డాయి.

అటు నిఫ్టి స్టాక్ మార్కెట్లు ఉదయం మంచి లాభాల్లో ప్రారంభమయ్యాయి. ముగింపు వరకు అదే దూకుడు కొనసాగింది. ఆరంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్ 360 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 92 పాయింట్లతో దూకుడుగా ప్రారంభించింది. ఓ దశలో సెన్సెక్స్ 39,623 పాయింట్లను తాకింది. చివరకు 600 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ ఏడు నెలల గరిష్టాన్ని తాకింది. ఇక, డాలర్ మారకంతో రూపాయి 17 పైసలు క్షీణించి 73.46 వద్ద ముగిసింది. ప్రారంభంలో డాలర్ మారకంతో రూపాయి 13 పైసలు బలపడి 73.16 వద్ద ట్రేడ్ అయ్యింది. నిన్నటి సెషన్‌లో 73.29 వద్ద ముగిసింది. చివరకు 17 పైసల నష్టాన్ని మూటగట్టుకుంది.

Follow Us
వందల సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం
వందల సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం
వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..
వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..
అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒక్కడంటే ఒక్కడు
అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒక్కడంటే ఒక్కడు
గురువు అనుకూలత.. ఇక వారి సమస్యలు మటాష్..!
గురువు అనుకూలత.. ఇక వారి సమస్యలు మటాష్..!
ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఆ విషయాలపై కీలక చర్చ..
ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఆ విషయాలపై కీలక చర్చ..
సమ్మర్‌లో కరెంట్ బిల్లు పెరుగుతుందా..? ఈ ట్రిక్స్‌తో డబ్బులు ఆదా
సమ్మర్‌లో కరెంట్ బిల్లు పెరుగుతుందా..? ఈ ట్రిక్స్‌తో డబ్బులు ఆదా
ఆ కారణంతోనే నాగార్జునతో సినిమా చేయలేదు.. డైరెక్టర్ వివి వినాయక్..
ఆ కారణంతోనే నాగార్జునతో సినిమా చేయలేదు.. డైరెక్టర్ వివి వినాయక్..
సౌందర్య సినిమాతోనే డబ్బంతా పోయింది.. కానీ ఆ మూవీ వల్లే..
సౌందర్య సినిమాతోనే డబ్బంతా పోయింది.. కానీ ఆ మూవీ వల్లే..
ఇస్త్రీ చేసే పని ఉండదు.. వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే జరిగే
ఇస్త్రీ చేసే పని ఉండదు.. వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే జరిగే
చిలగడదుంపల పూరీ.. నూనె అస్సలు పీల్చకుండా, పువ్వుకంటే మెత్తగా..
చిలగడదుంపల పూరీ.. నూనె అస్సలు పీల్చకుండా, పువ్వుకంటే మెత్తగా..