AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds Investment: మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మతిపోయే రాబడి.. టాప్-5 మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవే..!

భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల సంఖ్య పెరిగింది. గతంలో స్థిర ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ మద్దతుతో ఉన్న పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు. కానీ పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పథకాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపేవారు కూడా ఇటీవల కాలంలో పెరిగారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్‌లో మిడ్-క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడితో వచ్చే రాబడి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Mutual Funds Investment: మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మతిపోయే రాబడి.. టాప్-5 మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవే..!
Mutual Funds
Nikhil
|

Updated on: Feb 13, 2025 | 3:38 PM

Share

పెట్టుబడిదారులు గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక రాబడిని పొందవచ్చు. ఇలాంటి వారికి మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపికగా మారాయి. గత ఐదు సంవత్సరాల్లో అనేక మిడ్-క్యాప్ ఫండ్లు స్థిరంగా 25 శాతానికి పైగా రాబడిని అందించాయి. అందువల్ల వృద్ధి అవకాశాలను ఉపయోగించుకోవాలనుకునే పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపికలుగా నిలిచాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ రిస్క్ టాలరెన్స్, ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. 

మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడిదారులు ముందస్తు అనుభవం లేకుండా ఈక్విటీ లేదా డెట్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ఆర్థిక సాధనాలు. ఈ ఫండ్స్ అనేక మంది పెట్టుబడిదారుల నుంచి మూలధనాన్ని సమీకరించి ఆపై డిమాండ్‌కు అనుగుణంగా ఈక్విటీ లేదా డెట్ మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. అందుకు వారు చార్జీలను మినహాయించుకుని  తర్వాత లాభాలను తమ పెట్టుబడిదారులకు తిరిగి ఇస్తారు. అయితే ఒక్కోసారి మార్కెట్లలో అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై ప్రతికూల రాబడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్‌లో మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్ల ద్వారా తమ మూలధనంలో ఎక్కువ భాగాన్ని మిడ్-క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెడతారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీలు దాదాపు రూ. 5000-20000 కోట్ల మధ్య మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంటాయి. 

గత ఐదు సంవత్సరాలలో పెట్టుబడిదారులకు 25 శాతానికి పైగా రాబడిని అందించిన మిడ్-క్యాప్ కేటగిరీలో టాప్-1గా క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ నిలిచింది. ఈ ఫండ్స్ ఐదేళ్లల్లో పెట్టుబడిదారులకు 31.26 శాతం రాబడిని అందించింది. ఈ కంపెనీ ఎన్ఏవీ రూ.232.79గా ఉంటే ఏయూఎం రూ.8503 కోట్లుగా ఉంది. అలాగే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఐదేళ్లల్లో పెట్టుబడిదారులకు 28.97 శాతం రాబడిని అందించింది. ఈ కంపెనీ ఎన్ఏవీ రూ.111.10గా ఉంటే ఏయూఎం రూ.25,280కోట్లుగా ఉంది. ఎడెల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్ ఐదేళ్లల్లో పెట్టుబడిదారులకు 27.52 శాతం రాబడిని అందించింది. ఈ కంపెనీ ఎన్ఏవీ రూ.92.39గా ఉంటే ఏయూఎం రూ.11,720 కోట్లుగా ఉంది. అలాగే హెచ్ఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్స్ ఐదేళ్లల్లో పెట్టుబడిదారులకు 26.66 శాతం రాబడిని అందించింది. ఈ కంపెనీ ఎన్ఏవీ రూ.196.63గా ఉంటే ఏయూఎం రూ.74,193 కోట్లుగా ఉంది. మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ ఐదేళ్లల్లో పెట్టుబడిదారులకు 25.94 శాతం రాబడిని అందించింది. ఈ కంపెనీ ఎన్ఏవీ రూ.374.76గా ఉంటే ఏయూఎం రూ.3352 కోట్లుగా ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి