AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Auction: బంగారంపై రుణాలు.. కేంద్రం కొత్త నిబంధనలు.. వారికి వార్నింగ్

బంగారం తాకట్టు విషయంలో కేంద్రం తాజా హెచ్చరికలు చేసింది. కొందరు తమ అవసరం కోసం బ్యాంకులు, పాన్ షాపుల్లో తమ బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు. అయితే, వారు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించలేని పక్షంలో ఆ బంగారాన్ని వేలం వేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలు కీలకంగా మారాయి.

Gold Auction: బంగారంపై రుణాలు.. కేంద్రం కొత్త నిబంధనలు.. వారికి వార్నింగ్
Bhavani
|

Updated on: Feb 12, 2025 | 10:28 PM

Share

గోల్డ్ లోన్ చెల్లించలేని కారణంగా బ్యాంకులు ఇష్టారీతిన ప్రజల సొమ్మును వేలం వేయడానికి వీల్లేదని కేంద్రం ప్రకటన చేసింది. బంగారం వేలం వేసే విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. ఈ మేరకు లోక్ సభలో ప్రకటన చేశారు.

వారిపై కఠిన చర్యలు..

కమర్షియల్ బ్యాంకులు సామాన్యుల సొమ్మును వేలం వేసే పక్షంలో కచ్చితంగా ఆర్బీఐ నిబంధనలను పాటించి తీరాలనే రూల్స్ ఉన్నాయి. అయితే, కొందరు సాధారణ పాన్ షాపుల్లో తమ బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు. అయితే వీరు ఎలాంటి రూల్స్ పాటించరు. కస్టమర్లకు గడువు ముగిసిన తర్వాత ఎలాంటి హెచ్చరికలు లేకుండా వారి బంగారాన్ని వేలం వేసేస్తుంటారు. ఇకపై ఎవరైనా ఇలా చేస్తున్నట్టు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హెచ్చరించారు.

కస్టమర్ కు తెలియజేయాలి..

లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఒకేలాంటి నియమాలు పాటించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి రాకున్నప్పటికీ బిడ్డింగ్ విషయంలో వీరు కచ్చితంగా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం వేలం వేసే ముందు వారికి నోటీసులు పంపించాల్సి ఉంటుంది.

అందరికీ అవే రూల్స్..

ఆభరణాల సొమ్మును రుణ గ్రహీతలు తిరిగి చెల్లించడంలో విఫలమైతే బ్యాంకు లేదా ఎన్ ఎఫ్ బీసీ వేలానికి వెళ్లవలసి వస్తుంది. కానీ దానిని కస్టమర్ కు సరిగ్గా తెలియజేయాలి. ఈ ప్రక్రియలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఈ విషయంలో ఒకే విధమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుందని నిర్మలాసీతారామన్ గుర్తుచేశారు.

ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్