- Telugu News Photo Gallery Technology photos Do you like online gaming? Don't forget to buy these monitors, Best gaming monitor details in telugu
Best gaming monitor: ఆన్ లైన్ గేమింగ్ అంటే మీకు ఇష్టమా..? ఈ మానిటర్లను ట్రై చేయాల్సిందే..!
ఆధునిక కాలంలో ఆన్ లైన్ గేమ్ లకు ఎంతో ఆదరణ పెరిగింది. ఒత్తిడి నుంచి ఉపశమనం, కాలక్షేపం, సరదా కోసం చాలామంది ఆన్ లైన్ గేములు ఆడుతూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ వాటిని ఇష్టపడతారు. అయితే ఆన్ లైన్ గేమింగ్ ను ఆస్వాదించాలంటే, దానికి అనుగుణంగా ఉండే మానిటర్లు కావాలి. సాధారణంగా కంప్యూటర్లలో ఉండే మానిటర్లు గేమింగ్ కోసం పనికిరావు. ఈ నేపథ్యంలో పలు కంపెనీల గేమింగ్ మానిటర్లు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. అయితే అమెజాన్ లో అత్యంత తక్కువ ధరకే ఇవి అందుబాటులో లభిస్తున్నాయి. వాటి వివరాలు, ప్రత్యేకతలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Feb 12, 2025 | 8:23 PM

గేమింగ్ కోసం నంబర్ వన్ మానిటర్ కావాలనుకునేవారు ఎల్ జీ అల్ట్రా గేర్ ఐపీఎస్ గేమింగ్ మానిటర్ ను ఎంపిక చేసుకోవచ్చు. 60.45 అంగుళాల స్క్రీన్, 3.94 కిలోల బరువు, 178 డిగ్రీల వీక్షణ కోణం, ఏఎండీ ఫ్రీసింక్ తో ఆకట్టుకుంటోంది. డిస్ ప్లే పోర్టు, హెచ్డీఎంఐ పోర్టు, హెడ్ ఫోన్ అవుట్ తో వివిధ పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. ఎర్గోనామిక్ స్టాండ్ తో మానిటర్ ఎత్తు, టిల్ట్, పివోట్ లను సద్దుబాటు చేసుకోవచ్చు. సుదీర్ఘ గేమింగ్ సెషన్లలో కూడా ఎలాంటి అవాంతరాలు ఉండవు. అమెజాన్ లో రూ.11,111కి ఈ మానిటర్ అందుబాటులో ఉంది.

గేమింగ్ ఎంతో ఉపయోగంగా ఉండే మానిటర్లలో అసర్ నిట్రో వీజీ271యూ ఎం3 ముందు వరుసలో ఉంటుంది. దీనిలోని 27 అంగుళాల స్క్రీన్ తో విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. 0.5ఎంఎస్ ప్రతి స్పందన సమయం, హెచ్ డీఆర్ 10 మద్దతు, సినిమా నాణ్యత కలిగిన విజువల్స్, ఏఎండీ ఫ్రీసింగ్ టెక్నాలజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 2హెచ్ డీఎంఐ పోర్టులు, ఒక డిస్ ప్లే పోర్టు, అంతర్నిర్మిత స్పీకర్లు, యాంటీ గ్లేర్ ఐపీఎస్ ప్యానెల్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం 4.6 కేజీల బరువైన ఈ గేమింగ్ మానిటర్ ను అమెజాన్ లో రూ.14,998కి కొనుగోలు చేయవచ్చు.

గేమింగ్ కోసం రూపొందించిన మానిటర్లలో బెన్ క్యూ మోబిజ్ ఈఎక్స్2510ఎస్ ఒకటి. దీనిలో 24.5 అంగుళాల స్క్రీన్, ఆడియో స్పష్టతకు ఫ్రీసింక్ ప్రీమియం, 2.5 వాట్ల ట్రోవోలో స్పీకర్లు, బెజెల్ లెస్ డిజైన్, సద్దుబాటు చేయగల స్టాండ్ ఆకట్టుకుంటున్నాయి. కంటి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు, ఎర్గోనామిక్ డిజైన్, 5.7 కిలోల బరువు ఈ గేమింగ్ మానిటర్ అదనపు ప్రత్యేకతలు.

లెనోవా ఉత్పత్తులకు మన దేశంలో ఎంతో ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో గేమింగ్ అవసరాల కోసం ఆ కంపెనీ విడుదల చేసి లీజియన్ ఆర్25ఎఫ్-30 మానిటర్ ఎంతో ఆకట్టుకుంటోంది. 25 అంగుళాల స్పష్టమైన డిస్ ప్లేతో విజువల్ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఏఎండీ ఫ్రీసింక్ టెక్నాలజీ, 3 వాట్ల డ్యూయల్ స్పీకర్లు, సద్దుబాటు చేయగల స్టాండ్ టిల్ట్, హెచ్డీఎంఐ, డీపీతో సహా బహుళ కనెక్టివిటీ దీని ప్రత్యేకతలు. గేమింగ్ కోసం అద్భుతంగా ఉండే ఈ మానిటర్ ను అమెజాన్ లో రూ.13,099కి పొందవచ్చు.

కచ్చితత్వం, వేగం కోరుకునే గేమర్లకు సామ్సంగ్ ఒడిస్సీ జీ3 మానిటర్ చాలా బాగుంటుంది. 24 అంగుళాల స్క్రీన్, 2.4 కిలోల బరువు, అధిక పనితీరును కనబరిచే ఏఎండీ ఫ్రీసింక్ టెక్నాలజీ, కంటి ఒత్తిడిని తగ్గించడానికి ఐ-సేవర్ మోడ్, ప్లికర్- ఫ్రీ టెక్నాలజీ, ఎర్గోనామిక్ స్టాండ్ దీని ప్రత్యేకతలు. సొగసైన బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. అమెజాన్ లో రూ.10,399కి ఈ మానిటర్ అందుబాటులో ఉంది.





























