- Telugu News Photo Gallery Technology photos These phones are very special for gaming, as long as there is no interruption in the games, Best gaming phones details in telugu
Best gaming phones: ఈ ఫోన్లు గేమింగ్‌కు ఎంతో ప్రత్యేకం.. ఆటలకు అంతరాయం ఉండదంతే..!
ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ అవసరం విపరీతంగా పెరుగుతోంది. పెరిగిన సాంకేతికతతో అన్ని పనులు చాాలా సులభంగా, వేగంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనానికి దోహదపడుతున్నాయి. చాలామంది స్మార్ట్ ఫోన్లలో గేమ్ లు ఆడుతూ రిలాక్స్ అవుతుంటారు. ఇలాంటి వారికోసం అనేక ఆన్ లైన్ గేములు అందుబాటులో ఉన్నాయి. అయితే గేమింగ్ కు సాధారణ ఫోన్ పనికిరాదు. అధిక సామర్థ్యం కలిగిన చిప్, బ్యాటరీ, స్క్రీన్ ఉండాలి. ఈ నేపథ్యంలో గేమింగ్ కోసం ప్రముఖ కంపెనీల నుంచి అనేక స్మార్ట్ ఫోన్లు విడుదల అయ్యాయి. వాటిలో బెస్ట్ ఫోన్లు, ప్రత్యేకతలు, ధర వివరాలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Feb 12, 2025 | 4:15 PM

అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న గేమింగ్ ఫోన్లలో పోకో ఎక్స్ 7 ప్రో ఒకటి. మీడియా టెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్ సెట్, 6.67 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 90 డబ్ల్యూ వద్ద చార్జింగ్ అయ్యే 6550 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అనేక తాజా గేమ్ లను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎండలో కూడా స్క్రీన్ ను చక్కగా చూడగలగడం దీని అదనపు ప్రత్యేకత. ఈ ఫోన్ ను రూ.27,999కు కొనుగోలు చేయవచ్చు.

గేమింగ్ ప్రియులకు సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్ మంచి ఎంపిక. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 50 ఎంపీ ప్రైమరీ షూటర్, 12 ఎంపీ అల్ట్రా వైబ్ కెమెరా, 10 ఎంపీ టెలిఫొటో లైన్స్ ఆకట్టుకుంటున్నాయి. 45 డబ్ల్యూ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. సామ్సంగ్ కంపెనీ ఏడు సంవత్సరాల ఓఎస్ అప్ డేట్ లను హామీ ఇస్తోంది. ఈ ఫోన్ రూ.99,999కు అందుబాటులో ఉంది.

గేమింగ్ లో అంతరాయం లేకుండా, ఎక్కువ సమయం కొనసాగించాలనుకునే వారికి ఐఫోన్ 16 ప్రో చాలా బాగుంటుంది. దీనిలో పీసీ గేమ్ లను కూడా ఆడుకోవచ్చు. ఆపిల్ యాప్ స్టోర్ లోని ఆటలతో పాటు రెసిడెంట్ ఈవీల్ విలేజ్, డెత్ స్ట్రాండింగ్, అస్సాస్సిస్ క్రీడ్ మిరాజ్ తదితర ఎంపిక చేసిన పీసీ గేములు దీనిలో ఉన్నాయి. ఏ18 ప్రో బయోనిక్ చిప్ సెట్, ఓఎల్ఈడీ స్క్రీన్, మంచి కెమెరా సెటప్ ఆకట్టుకుంటున్నాయి. 128 జీబీ స్టోరేజ్ తో వస్తున్న ఈ బేస్ మోడల్ రూ.1,12,900కు అందుబాటులో ఉంది. అయితే పండగ సమయంలో దీనిపై డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉంది.

గేమింగ్ తో పాటు అన్ని రకాల పనులు చేసుకోవడానికి వన్ ప్లస్ 13 ఆర్ స్మార్ట్ ఫోన్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్, 6.78 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ టెలిఫోటో లెన్స్, 8 ఎంపీ అల్ట్రావైడ్ షూటర్, 80 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అమెజాన్ లో ఈ ఫోన్ ను రూ.42,999కి అందుబాటులో ఉంది.

అందుబాటు ధరలో మంచి గేమింగ్ ఫోన్ కొనాలనుకునే వారు రెడ్ మ్యాజిక్ 10 ప్రో ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ను మన దేశంలో విక్రయించరు. విదేశాల నుంచి కొనుగోలు చేయాలి. దీని ధర రూ.649 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.56,200. దీనిలో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్, 6.85 అంగుళాల అమోలెడ్ ఫ్యానల్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ షూటర్,2 ఎంపీ మాక్రో సెన్సార్ ఏర్పాటు చేశారు. 24 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్, 100 డబ్ల్యూ వద్ద చార్జింగ్ అయ్యే 7050 ఎంఏహెచ్ బ్యాటరీ బాగున్నాయి.





























