- Telugu News Photo Gallery Technology photos Tech Tips: Should you charge your phone from a laptop or PC know is it good or bad
Tech Tips: మీరు ల్యాప్‌టాప్, కంప్యూటర్ నుండి మీ ఫోన్‌ను ఛార్జ్ చేస్తే ఏమవుతుందో తెలుసా..?
Tech Tips: చాలా మందికి ఫోన్‌ను ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లకు ఛార్జ్ చేస్తుంటారు. మరి ఇలా ఛార్జర్‌తో కాకుండా ల్యాప్‌టాప్, కంప్యూటర్ నుంచి చేస్తే ఏమవుతోందో తెలుసా..? చాలా మందిలో ఈ అలవాటు ఉంటుంది. ఇలా ఛార్జ్ చేస్తే మీ మొబైల్ బ్యాటరీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు..
Updated on: Feb 12, 2025 | 1:56 PM

ఈ రోజుల్లో ఎంతో మంది స్మార్ట్ ఫోన్‌తోనే ఎక్కువసమయం గడిపేస్తున్నారు. ఇది వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటాము. చాలా మంది తమ ల్యాప్‌టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్‌లోని USB పోర్ట్‌ని ఉపయోగించి తమ మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసుకుంటారు. మరి ఇలా ఛార్జ్ చేయడం సరైనదేనా?

ల్యాప్‌టాప్‌లు ఉపయోగించే వ్యక్తులు తరచుగా అక్కడి నుండి తమ మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసుకుంటారు. చాలా మంది అడాప్టర్లతో చేసుకోక ఇలా ఛార్జ్ చేయడం అలవాటుగా మారుతుంది. చాలా మంది తమ మొబైల్ ఫోన్‌లను సరిగ్గా ఛార్జ్ చేయలేకపోతున్నారు.

స్మార్ట్‌ఫోన్ ఖచ్చితంగా అసలు ఛార్జర్‌తో ఛార్జ్ చేయాలి. అయితే, ఎవరి దగ్గరైనా అసలు మొబైల్ ఛార్జర్ లేకపోతే, ఫోన్ ఛార్జ్ అయిపోబోతుంటే, ల్యాప్‌టాప్ నుండి ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంటారు. కానీ ఇలా క్రమం తప్పకుండా చేయడం అస్సలు సరైనది కాదు. ఎవరైనా ల్యాప్‌టాప్ నుండి తమ మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేస్తే, అది ఫోన్ బ్యాటరీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

చాలా ల్యాప్‌టాప్‌లలో ఛార్జింగ్ కోసం ఉపయోగించగల యూఎస్‌బీ పోర్ట్‌లు ఉంటాయి. ల్యాప్‌టాప్‌లోని USB పోర్ట్ సాధారణంగా ఫోన్‌లను ఛార్జ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దానికి కనెక్ట్ చేయడం ద్వారా ఫోన్ ఛార్జ్ అవుతుంది. ల్యాప్‌టాప్‌తో మీ ఫోన్‌ను పదే పదే ఛార్జ్ చేయడం వల్ల ఛార్జింగ్ వేగం దెబ్బతింటుంది. ల్యాప్‌టాప్ USB పోర్ట్‌లు సాధారణంగా ఫోన్ ఛార్జర్‌ల కంటే తక్కువ శక్తివంతమైనవి. ఫోన్ ఛార్జ్ కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.

ఒరిజినల్ ఛార్జర్ లేకుండా ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల ఓవర్ హీటింగ్ సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఫోన్ వేడెక్కి, పేలిపోవచ్చు. ల్యాప్‌టాప్ నుండి ఫోన్‌ను తరచుగా ఛార్జ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.




