ఓరీ దేవుడో.. ఇవేం ధరలు బాబోయ్.. 4 అడుగులు లేని ఫ్లాట్ కు వేలల్లో రెంట్..
అభిషేక్ ఫ్లాట్ మధ్యలో నిలబడి రెండు చేతులను చాచిపెడితే.. ఏకంగా రెండు వైపుల గోడలు తగులుతున్నాయి. అలాగే, ఓ చేయి, కాలు చాచి వంగితే.. ఆ రూమ్ పొడువుకు సరిపోతుంది. ఇక ఆ రూమ్‌కి అటాచ్డ్‌గా బాల్కనీ ఉందండోయ్.. అందుకే ఈ రూమ్‌ని "1BR అంటున్నారు. ఇక ఆ బాల్కనీ అయితే మరీ చిన్నది. ఒక వ్యక్తి నిలబడితే ఇక పక్కకు తిరగడం కూడా కష్టమే అవుతుంది.

‘ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదు..’ అవును ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్‌తో సహా దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబైతో పాటుగా ఇప్పుడు ఐటీ రాజధాని బెంగళూరులో కూడా సామాన్య ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇక్కడ బతకాలంటే.. ఢిల్లీ-ముంబై కంటే చాలా రెట్లు కాస్ట్లీగా మారింది. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వివిధ ప్లాట్‌ఫామ్‌లపై చక్కర్లు కొడుతూ ఈ వీడియో జనాలకు షాక్ ఇస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో అనుకుంటున్నారా..? అయితే, పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
వైరల్ వీడియో బెంగళూరుకు చెందినదిగా తెలిసింది. అభిషేక్ సింగ్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో అతడు తన చిన్న రూమ్ విత్ బాల్కనీతో హోం టూర్ చేస్తున్నాడు. ఈ ఫ్లాట్ చూస్తుంటే ఎంత ఇరుకుగా, చిన్నగా ఉందో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కానీ, ఈ రూమ్ విత్ బాల్కనీ అద్దె మాత్రం నెలకు రూ.25,000 కంటే ఎక్కువ చెల్లిస్తున్నారట. ఇంత చిన్న గది కోసం అంత పెద్దమొత్తంలో అద్దె చెల్లిస్తున్నందుకు నెటిజన్లు చాలా మంది షాక్ అవుతున్నారు. చాలా మంది ఆన్‌లైన్‌లో తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
అభిషేక్ ఫ్లాట్ మధ్యలో నిలబడి రెండు చేతులను చాచిపెడితే.. ఏకంగా రెండు వైపుల గోడలు తగులుతున్నాయి. అలాగే, ఓ చేయి, కాలు చాచి వంగితే.. ఆ రూమ్ పొడువుకు సరిపోతుంది. ఇక ఆ రూమ్‌కి అటాచ్డ్‌గా బాల్కనీ ఉందండోయ్.. అందుకే ఈ రూమ్‌ని “1BR అంటున్నారు. ఇక ఆ బాల్కనీ అయితే మరీ చిన్నది. ఒక వ్యక్తి నిలబడితే ఇక పక్కకు తిరగడం కూడా కష్టమే అవుతుంది. చిన్న గది కావడం వల్ల మీరు వస్తువులను కొనుక్కోవాల్సిన పనిలేదు. కాబట్టి డబ్బు కూడా ఆదా అవుతుందని నవ్వుతూ చెబుతాడు. చివరగా ఇంత చిన్నగది అద్దె నెలకు రూ. 25,000 అని చెప్తూనే.. ఇక గర్ల్ ఫ్రెండ్ కోసం ఖర్చు పెట్టేందుకు ఏం మిగలదంటూ ఫన్నీగా నవ్వేస్తాడు. ఈ వీడియో మాత్రం తీవ్ర సంచలనం రేపుతోంది. బెంగళూరులో అద్దె ధరలపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








