AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బార్డర్‌లో పోలీసులను చూసి కారు వదిలేసి పారిపోయారు.. దగ్గరకి వెళ్లి లోపల చెక్ చేయగా..

భారతదేశంలో డ్రగ్స్ దందా చాప కింద నీరులా విస్తరిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాలలో డ్రగ్స్ దందా యదేచ్చగా కొనసాగుతుంది. ఉల్లాసంగా ఉండడానికి, యంగ్‌గా కనిపించడానికి, ప్రిస్టేజ్‌ కోసం చాలా మంది యువతీ యువకులు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నరని నిపుణులు చెబుతున్నారు. వాటి కోసం ఎంత డబ్బు అయినా చెల్లించేందుకు రెడీ అవుతున్నారు. అందుకే డ్రగ్ పెడ్లర్లు రెచ్చిపోతున్నారు. l

Viral: బార్డర్‌లో పోలీసులను చూసి కారు వదిలేసి పారిపోయారు.. దగ్గరకి వెళ్లి లోపల చెక్ చేయగా..
Car (Representative image)
Ram Naramaneni
|

Updated on: Feb 13, 2025 | 4:31 PM

Share

మిజోరాంలోని చాంఫాయి జిల్లాలోని భారతదేశం-మయన్మార్ సరిహద్దులో రూ.173.73 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు అస్సాం రైఫిల్స్ బుధవారం తెలిపింది. ఫిబ్రవరి 9న జోఖావ్తార్‌లోని సరిహద్దు క్రాసింగ్ పాయింట్‌లో అస్సాం రైఫిల్స్, మిజోరాం పోలీసులు సంయుక్త దాడులు చేసి 57.9 కిలోల మెథాంఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సరుకును తీసుకెళ్తున్న అనుమానిత వ్యక్తులను పోలీసులు గుర్తించి.. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, కారులో ఉన్నవారు అప్రమత్తమై, ఆ కన్సైన్మెంట్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. 173.73 కోట్లు విలువైన ఈ కన్సైన్​మెంట్​ గురించి తదుపురి దర్యాప్తు, చట్టపరమైన చర్యలపై పోలీసుల ఫోకస్ పెట్టారు.

‘ఐస్’ లేదా ‘క్రిస్టల్ మెత్’ అని కూడా పిలిచే మెథాంఫెటమైన్ అత్యంత సైకోస్టిమ్యులెంట్ డ్రగ్. ఇది కొకైన్ మాదిరిగానే యువతను వ్యసనపరులు చేస్తుంది. మెథాంఫెటమైన్‌ డ్రగ్‌ అనేది రిలాక్స్‌ మూడ్‌లోకి తీసుకెళుతుందని వినియోగిస్తారని పోలీసులు తెలిపారు. ఈ సరుకు ఎక్కడినుండి వచ్చింది అన్న దానిపైన విచారణ కొనసాగుతుందని, నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారందరినీ త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..