ఈ చిట్కాలతో.. గ్యాస్ సిలెండర్లో గ్యాస్ ఎంత మిగిలిందో తెలుసుకోండి
సాధారణంగా చాలామంది ఇళ్లల్లో రెండు గ్యాస్ సిలెండర్లు ఉంటాయి. ఒకటి అయిపోగానే వెంటనే రెండోది పెట్టి వంట కంటిన్యూ చేస్తుంటారు. అలా కాకుండా ఒక్కటే సిలెండర్ ఉన్నా, రెండు సిలెండర్లు ఉండి ఏదైనా కారణం చేత రెండో సిలెండర్ బుక్ చేయకుండా ఖాళీగా ఉన్నా ప్రస్తుతం నడుస్తున్న సిలెండర్ ఎప్పుడైపోతుందో మధ్యలో వంట ఆగిపోతుంది అనే టెన్షన్ ఉంటుంది.
అసలే ఉరకల పరుగుల జీవితాలు. ఉదయాన్నే ఇంట్లో అందరికీ లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి. ఇలాంటి సందర్భంలో వంటింట్లో మహిళలు పడే టెన్షన్ మామూలుగా ఉండదు. సిలెండర్ అయిపోతుందేమో అని టెన్షన్ పడే మహిళలు చిన్నపాటి చిట్కాలతో ఈ టెన్షన్ నుంచి బయటపడచ్చు. అవేంటంటే ప్రస్తుతం నడుస్తున్న సిలెండర్ కు ఒక క్లాత్ ను తడిపి చుట్టి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత క్లాత్ తీసేయండి. ఇప్పుడు తేమ ఎక్కడివరకు ఉందో గమనించండి. తేమ ఎక్కడివరకు ఉందో అక్కడివరకు గ్యాస్ ఉన్నట్లు అర్థం. అలాగే గ్యాస్ అయిపోయే ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయి. వంట చేస్తున్నప్పుడు మంట నీలం రంగులో ఉండి మంట ఉజ్వలంగా ఉంటే గ్యాస్ పరిమాణం బాగానే ఉన్నట్లు అర్థం. అదే మంట బలహీనంగా ఉండి పసుపు రంగులో ఉంటే గనుక గ్యాస్ త్వరలోనే అయిపోతుంది అని సూచిస్తుందన్నమాట. అలాగే గ్యాస్ అయిపోయే ముందు సిలెండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు వాసన వస్తుంది. అలాగే స్టవ్ వెలిగించేటప్పుడు నల్లని పొగ వస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటర్నెట్ కాదు.. డేంజర్ నెట్! ఇంటర్నేషనల్ వేదికలపై సత్తా చాటుతున్న సినిమా
TOP 9 ET News: రూ.73 కోట్ల తండేల్.. దంచికొడుతున్న చైతూ
రజినీకాంత్ సినిమాకే ఇలాంటి గతి పడితే ఎలా?
Raghavendra Rao: తండేల్ సినిమాపై రాఘవేంద్రరావు రివ్యూ
Daaku Maharaaj: దిమ్మతిరిగే న్యూస్.. ఎక్స్‌ట్రా కంటెంట్‌తో.. OTTలోకి డాకు మహరాజ్

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
