Daaku Maharaaj: దిమ్మతిరిగే న్యూస్.. ఎక్స్‌ట్రా కంటెంట్‌తో.. OTTలోకి డాకు మహరాజ్
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. కొల్లి బాబీ అలియాస్ కె.ఎస్. రవీంద్ర తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా ఈ మూవీ రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక థియేటర్లలో ఆడియన్స్ కు పూనకాలు తెప్పించిన డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే బాలయ్య సినిమా స్ట్రీమింగ్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అప్డేట్ బయటికి వచ్చింది. డాకు మహారాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తం చెల్లించి నట్లు కూడా సమాచారం. అయితే ఈ మూవీని ఫిబ్రవరి 09 నుంచి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుందని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. ఈక్రమంలోనే ఈ మూవీ వచ్చే వారంలో అంటే ఫిబ్రవరి 16 లేదా ఆ తర్వాత స్ట్రీమింగ్‌కు రావచ్చని ఇన్‌సైడ్ టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Thandel: తండేల్ సినిమా చూస్తూ.. వెక్కి వెక్కి ఏడ్చిన లేడీ
ఇకపై హెల్మెట్ పెట్టుకోకపోతే.. మీ బైక్ స్టార్ట్ కాదు
‘నాన్నా నువ్వు చనిపోతావా..’ కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సైఫ్
సాయి పల్లవిని చూసి ఆశ్చర్యపోయిన నాగ్.. ఆకాశానికెత్తుతూ ట్వీట్!